twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఏం బాబూ లడ్డూ కావాలా’రిలీజ్ డేట్ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : గాంధీమనోహర్ దర్శకత్వంలో శివాజి, అదితిఅగర్వాల్ జంటగా టి.జనార్ధన్ నిర్మించిన చిత్రం 'ఏం బాబూ లడ్డూ కావాలా'. సెప్టెంబర్ నెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగం తప్ప అనుమానం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ అనుమానం పెనుభూతంలా మారి వారి జీవితాలను ఎలాంటి సమస్యలకు లోను చేస్తుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'ఏం బాబూ లడ్డూ కావాలా'.

    ఎం.ఎం.శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల 'ఆదిత్య' ద్వారా ఆడియో మార్కెట్లోకి రిలీజెైంది. ఆడియో సక్సెస్‌ పై సంగీతదర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ ''ఇటీవల రిలీజెైన ఈ సినిమా ఆడియో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధానంగా భాస్కరభట్ల సాహిత్యం అస్సెట్‌గా నిలిచింది. అలాగే హీరో శివాజీతో నాకు 7వ సినిమా ఇది. 5పాటలు వెైవిధ్యంగా కుదిరాయి'' అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -''కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. వినోద ప్రధానంగా సాగుతుంది. శ్రీలేఖ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది'' అన్నారు.

    ఇక ఈ చిత్రం తన కెరీర్‌కి ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గాంధీమనోహర్. చిత్రంలోని 'రాణి రాణి రాణి రాణి లోనకెళ్లి వేసుకొచ్చె లంగా ఓణి, రాణి రాణి రాణి రాణి తొంగి తొంగి చూడమంది సింగారాన్ని...' అంటూ రేవంత్‌ పాడిన పాట సూపర్ హిట్ అయ్యిందన్నారు. అలాగే 'మీ ఆడవాళ్లు ఇంతే మీ ఆడవాళ్లు ఇంతే, అపార్థాలతో కాపురాలనే కాలదన్నుకుని పోతారు, బోడిగుండుతో కోడిగుడ్డుకు కొత్తగ లింకులు పెడతారు' అనే అంటూ మురళి ఆలపించిన పాట సైతం ఆకట్టుకుంటోందన్నారు.

    శివాజీ మాట్లాడుతూ 'ఈ చిత్రం టైటిల్‌ చాలా క్యాచీగా ఉంది. పరిశ్రమలోని పెద్ద కమెడియన్స్‌ అంతా నటించారు' అన్నారు. ఈ చిత్రంలో రచనామౌర్య, ఎం.ఎస్‌.నారాయణ, చిత్రంశ్రీను, భావన, జీవా, సత్యం రాజేష్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: బి.వాసు, నిర్మాత: టి.జనార్ధన్‌, దర్శకుడు: గాంధీ మనోహర్‌

    English summary
    
 Sivaji' is now coming out with a film titled Em Babu Laddu Kavala. This romantic comedy is produced by T Janardhan and directed by Gandhi Manohar. The film is relesing on 13th september.
 Music has been composed by MM Sri Lekha for the lyrics penned by Bhaskarabhatla. The cinematography for the film has been handled by B Vasu and edited by Nagi Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X