twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లాపైతై వేరే, ఏ హీరోకి కథ చెప్పనంటూ ఛాలెంజ్

    By Srikanya
    |

    ''ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది. ఒకవేళ హిట్ కాకపోతే వేరే ఏ హీరోకీ కథ చెప్పను. సినిమాలు కూడా తియ్యను. చిత్రవిజయంపై నాకున్న నమ్మకం అలాంటిది'' అని దర్శకుడు గాంధీమనోహర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో శ్రీమతి వనితా సమర్పణలో వనితాస్ డ్రీమ్‌లైన్ పతాకంపై శివాజి, అదితిఅగర్వాల్ జంటగా జనార్ధన్ నిర్మిస్తున్న చిత్రం 'ఏం బాబూ లడ్డూ కావాలా!'. ఈ నెల 17న పాటలు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇలా స్పందించారు.

    హీరో శివాజి మాట్లాడుతూ...ఇదే టైటిల్ ఈవీవీ సినిమాది అయితే తప్పకుండా వంద రోజులాడుతుంది. ఈ చిత్రం ఈవీవీగారి సినిమాలానే ఉంటుంది. బాపుగారి శిష్యుడు కాబట్టి ఆయన స్థాయికి తగ్గకుండా ఈ చిత్రం తీశాడు గాంధీ మనోహర్. శ్రీలేఖ, భాస్కరభట్లతో నాకిది ఎనిమిదవ సినిమా. సమిష్టి కృషితో రూపొందించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే చిత్రమిది. లడ్డు అంత మధురంగా ఉంటుంది. మా చిత్రం పేరుకి ఎంచుకొన్న డైలాగ్‌ ఇప్పటికే జనానికి చేరువైంది. దీంట్లో నా పాత్ర అందరికీ నచ్చుతుంది అన్నారు.

    హాస్య నటుడు ఏవీయస్ మాట్లాడుతూ ...ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. సినిమాకి ప్లస్ అయ్యే పాత్ర. బాపుగారి శిష్యుడు కాబట్టి గాంధీ సన్నివేశాలన్నీ చక్కగా రాసుకుని ఈ చిత్రం తీశాడు అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే ఆడియో ఇదని భాస్కరభట్ల రవికుమార్ అన్నారు.

    నిర్మాత జనార్ధన్ మాట్లాడుతూ...ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సినిమా చేశాం. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. లడ్డూ అంత తియ్యగా ఉంటుంది అన్నారు. ఎమ్మెస్‌ నారాయణ, ఏవీయస్‌, జీవా, చిత్రం శ్రీను, సత్యం రాజేష్‌, రచనా మౌర్య, భావన తదితరులు ఇతర పాత్రధారులు. పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: బి.వాసు, సంగీతం: శ్రీలేఖ.

    English summary
    Hero Sivaji’s new film under the direction of Gandhi Manohar has been titled as "Em Babu Laddu Kavala". The movie is being produced by Janardhan under Vanitha's dream line banner. While speaking to media Sivaji said that the title "Em Babu Laddu Kavala" is apt for this film. In this film Aditi Agarwal is playing the female lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X