twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేవలం 17 రోజుల్లో ..‘ఏం బాబు లడ్డూ కావాలా’

    By Srikanya
    |

    హైదరాబాద్ : గాంధీమనోహర్ దర్శకత్వంలో వనితాస్ డ్రీమ్‌లైన్ పతాకంపై శివాజి, అదితి అగర్వాల్ జంటగా టి.జనార్ధన్ నిర్మిస్తున్న చిత్రం 'ఏం బాబు లడ్డూ కావాలా'. ఈ చిత్రం టాకీ కేవలం 17 రోజుల్లో పినిష్ చేసినట్లు సమాచారం. అలాగే అతి తక్కువ బడ్జెట్ లో అత్యంత క్వాలిటీతో ఈ చిత్రం తయారైందని తెలుస్తోంది. పూర్తి స్ధాయి కామెడీగా తయారైన ఈ చిత్రం గురించి నిర్మాత టి.జనార్ధన్ మాట్లాడుతూ...
    ''మా చిత్రం ప్రేక్షకులకు తియ్యని లడ్డూలు తిన్నంత ఫీలింగ్‌ని కలుగజేస్తుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం కడుపుబ్బా నవ్విస్తుంది''అన్నారు.

    శివాజీ, అతిథి అగర్వాల్ జంటగా డ్రీమ్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'ఏం బాబు లడ్డూ కావాలా?'. గాంధీమనోహర్ దర్శకత్వంలో టి.జనార్ధన్, శ్రీ వనిత ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని హంగులు పూర్తిచేసుకుని ఈ సినిమా 21 న విడుదలకు ముస్తాబయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పూర్తి వినోదాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పేరుకు తగ్గట్టే ప్రేక్షకులను నవ్విస్తుందని, ఐదు పాటలు వేటికవే హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో రచనావౌర్య పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

    హీరో శివాజీ మాట్లాడుతూ "ఇలాంటి సినిమాని ఈవీవీ సత్యనారాయణ తీస్తే వంద రోజులు గ్యారంటీగా ఆడుతుంది. గాంధీ కూడా ఆ తరహాలోనే చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుందనే ఫీలింగ్ ఉంది. శ్రీలేఖతో ఇది నాకు ఎనిమిదో సినిమా. భాస్కరభట్ల చాలా చక్కని పాటలు రాశారు. అందుకే ఆడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.

    ఏవీఎస్‌ మాట్లాడుతూ- 2012లో విడుదలైన చిన్న పెద్ద సినిమాలన్నీ కూడా అగ్ర విజయాలను సాధించాయి. ఆ తరహాలోనే మీ ముందుకు రాబోతున్న మరో చిత్రం 'ఏం బాబు లడ్డూ కావాలా'. నేనీ సినిమాలో ఓ మంచి వేషం వేశాను. బాపుగారి శిష్యుడైన గాంధీ మనోహర్‌ ఆ చిత్రాన్ని అద్భుతంగా రూపుదిద్దాడు. ఆయన గురువుకు ఏమాత్రం తీసిపోలేదు. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సినిమా సాగుతుంది అన్నారు.

    ఎమ్మెస్ నారాయణ, చిత్రం శ్రీను, భావన, జీవా, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, కెమెరా: బి.హను, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నిర్మాతలు: టి.జనార్ధన్, శ్రీవనిత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గాంధీ మనోహర్. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: చందక రాజ్‌కుమార్.

    English summary
    Sivaji's new movie 'Em babu laddo kavaala? is all set for release on September 21. The film has Aditi Agarwal playing the female lead while Rachna Mourya will be seen in a vital role. Made on a shoe-string budget in just 17 days, Sivaji said that the film will be an entertainer and suits all age groups. Gandhi Manohar, a protege of director Bapu, exudes confidence that audience will surely enjoy the film and come out happily.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X