పవన్ కళ్యాణ్ డైరక్టర్ తో శివాజి
పవన్ కల్యాణ్ తో 'గుడుంబా శంకర్' చిత్రాన్ని రూపొందించిన వీరశంకర్ దర్శకత్వంలో శివాజి నటించనున్నారు. అలాగే జెడి చక్రవర్తి కూడా మరో కీలకమైన పాత్రను పోషించనున్నారు. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ "వినోద ప్రధానమైన కథాంశంతో అల్లుకొనే చిత్రమిది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా, వైవిధ్యంగా ఉంటుంది. దీంట్లోని ప్రధాన పాత్రలకు జేడీ, శివాజీ అయితేనే బాగుంటారు. తప్పకుండా వాళ్ల నటన ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. ఈ చిత్రం షూటింగ్ జులై నుంచి మొదలవుతుంది. త్వరలో మిగిలిన ముఖ్య తారాగణం వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. సూరితల్లి క్రియేషన్స్ పతాకంపై కాదులూరి చెల్లారెడ్డి, పిబి త్రినాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక వీరశంకర్ ఇంతకుముందు యువరాజ్యం చిత్రాన్ని రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది ఇంకా రిలీజ్ కాలేదు.
పవన్ కళ్యాణ్ జెడి చక్రవర్తి శివాజి మీరా జాస్మిన్ pawan kalyan jd chakravarhty gudamba shankar meera jasmine sivaji


Click it and Unblock the Notifications