For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yashoda ముగిసిన వివాదం.. ఒకరిని బాధ పెట్టే ఉద్దేశం మాకు లేదు.. ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్

  |

  దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కీలక పాత్రలో నటించిన యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్నది. దర్శక ద్వయం హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజై అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

  అయితే ఈ సినిమాలో ఈవా (EVA) పేరును ఉపయోగించడంతో హైదరాబాద్‌లో 'ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. దాంతో ఈ సినిమా వివాదంలో కూరుకుపోయినట్టు కనిపించింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  యశోద ఓటీటీ రిలీజ్‌ నిలిపివేయాలంటూ

  యశోద ఓటీటీ రిలీజ్‌ నిలిపివేయాలంటూ

  యశోద సినిమా ఓటీటీ రిలీజ్‌ నిలిపివేయాలంటూ ఈవా ఐవీఎఫ్ ఎండీ మోహన్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ స్పందించారు. పిటిషనర్‌తో మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించారు. సినిమాలో ఈవా (EVA) పేరును తొలగించినట్టు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడంతో 'ఈవా ఐవీఎఫ్' ఎండీ మోహన్ రావుతోకలిసి మంగళవారం శివలెంక కృష్ణప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.

  సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం.

  సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం.

  శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మించిన 'యశోద' విజయవంతమైన సంగతి తెలిసిందే. సినిమాలో మేం సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం. దానికి 'ఈవా' అని పేరు పెట్టాం. దానికి మేం ఇచ్చిన నిర్వచనం వేరు. అయితే, సినిమా పవర్ ఫుల్ మీడియం కావడం... 'యశోద'లో ఈవా అని చూపించడంతోతమకుఇబ్బంది కలుగుతుందని హైదరాబాద్‌, వరంగల్‌కు చెందిన ఈవాఐవీఎఫ్ ఫెర్టిలిటీ హస్పిటల్ యాజమాన్యం కోర్టు ద్వారా న్యాయం కోసం ప్రయత్నించారు అని తెలిపారు.

  సినిమా ఇండస్ట్రీ పట్ల గౌరవం

  సినిమా ఇండస్ట్రీ పట్ల గౌరవం

  థియేటర్లలో కాకుండా ఓటీటీ వరకు ఈవా పేరు వాడకూడదని కోర్టు ఆర్డర్స్ఇచ్చింది. మాకు ఈ విషయం తెలియదు.ఒకరినిబాధ పెట్టే ఉద్దేశం గానీ, ఇతరుల మనోభావాలను కించపరిచే ఆలోచన గానీ మాకు అసలు లేదు. అందుకని, వెంటనే ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ వర్గాలనుసంప్రదించాను. సినిమా ఇండస్ట్రీ పట్ల మాకు గౌరవం ఉంది. మమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉంది. అందుకని, ఇలా చేశాం అని చెప్పారు. 'ఈవా' పేరు తీసేస్తామని నేను చెబితే... అప్పుడుతమకుఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకుగాను మీడియా ముఖంగా 'ఈవా ఐవీఎఫ్' యాజమాన్యానికి, ఆసుపత్రి వర్గాలకుకృతజ్ఞతలు చెబుతున్నాను.

  ఈవా పేరు కనిపించదు

  ఈవా పేరు కనిపించదు

  యశోద సినిమాలో ఈవా అనేదానిని తొలగించాం. భవిష్యత్తులో యశోద సినిమాలో ఎక్కడా 'ఈవా' పేరు కనిపించదు. అయితే, థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. థియేటర్లలో పేరు మార్చాలంటే సెన్సార్ ద్వారా జరగాలి. ఆ తర్వాత కేడీఎంలుచేంజ్ చేయాలి. దానికి కొంత టైమ్ పడుతుంది. ఈ విషయం చెబితే... 'ఈవా ఐవీఎఫ్' ఆసుపత్రి వర్గాలు అంగీకరించాయి. నేను వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళాను. ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారు. మంచి సర్వీస్ అందిస్తున్నారు. మాకుఈ విషయం తెలియక పేరు వాడడంతో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించింది. మేం ఇద్దరం హ్యాపీ అని శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పారు.

  ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ

  ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ

  ఈవా ఐవీఎఫ్ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ ''కొన్ని రోజులక్రితం నేను మీడియా ముందుకు వచ్చి 'యశోద'లో మా ఆసుపత్రి పేరు ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాను. ఆ రెండో రోజు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు మమ్మల్ని సంప్రదించారు. కోర్టు ద్వారా మేం వ్యక్తం చేసిన అభ్యంతరాల పట్ల మాతో మాట్లాడారు. ఈవా పేరు తొలగిస్తామని చెప్పారు. మాకు ఇచ్చిన మాట ప్రకారం తొలగించారు కూడా! ఆ రోజు 'ఐదు కోట్లకుడ్యామేజ్ సూట్ వేశారుకదా?' అని కొందరు ప్రశ్నించారు. అప్పుడుకూడా చెప్పాను. డబ్బులకోసం కేసు వేయలేదు. దాని విలువ చెప్పాలని చేశాం అని అన్నారు.

  ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా

  ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా

  ఈవా ఐవీఎఫ్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడటంమా ఉద్దేశం. అందుకే కేసు వేశాం. మొన్న సాయంత్రం నాకు సినిమా చూపించారు. అందులో ఈవా పేరుకు సంబంధించినవి అన్నీ తొలగించారు. నిన్న (సోమవారం) మళ్ళీ న్యాయస్థానం దగ్గరకు వెళ్లి... 'యశోద' నిర్మాత చేసిన మార్పులతో సంతృప్తిగా ఉన్నామని చెప్పాం. అలాగే, కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపాం.

  వెంటనే కోర్టు ఆమోదించింది. ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా అయ్యింది. ఈ సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని నేను అనుకోలేదు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు, ఆయన టీమ్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. అందుకుచాలా సంతోషంగా ఉంది. నిర్మాతను సంప్రదిస్తే ఇంతత్వరగా పరిష్కారం లభిస్తుందని నాకు తెలియదు.

  అందుకే, చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లాను.సినిమాలో చూపించిన విధంగా విదేశాల్లో జరిగిఉండొచ్చు. మా దగ్గర ఎలా ఉంటుందనేది ఆసుపత్రికి నిర్మాతను తీసుకువెళ్లిచూపించాం. బయట ఎక్కడా సినిమాలో చూపించినట్టు జరగదు అని ఎండీ మోహన్ రావు చెప్పారు.

  English summary
  Yashoda movie has been directed by Hari & Harish with Samantha playing the title role produced under the banner of Sridevi Movies by Sivalenka Krishna Prasad. We all are aware of the fact that the film Yashoda has been released across the globe in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi languages and received tremendous response. With the name EVA being used in this film, the hospital authorities of “EVA IVF” have stepped the court premises. Producer Sivalenka Krishna Prasad had a healthy talk with the authorities and resolved the issue harmoniously.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X