అదిరిపోయిన శివమణి డ్రమ్స్, తమన్ బీట్.. ఇక బన్నీ స్టెప్పులేస్తే రచ్చ రచ్చే

Recommended Video

అదిరిపోయిన శివమణి డ్రమ్స్, తమన్ బీట్.. ఇక బన్నీ స్టెప్పులేస్తే రచ్చ రచ్చే

శివమణి డ్రమ్స్ వాయిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. అతను డ్రమ్స్ వాయిస్తూ ఉంటే.. ఎవరికైనా ఊపు రావాల్సిందే. అలాంటిది టాలీవుడ్ మైఖెల్ జాక్సన్ అని పేరున్న నటుడు ఆగుతాడా? ఆ బీట్ కు అతను వేసే స్టెప్పులు చూసిన తరువాత అభిమానులను ఆపగలమా? అయితే అదెలా ఉంటుందో తమన్ శాంపుల్ గా చూపించాడు.

వైరల్ అయిన సామజవరగమన..

వైరల్ అయిన సామజవరగమన..

సామజవరగమన.. నిను చూసి ఆగగలనా అని పాట రాసిన సిరివెన్నెల ఊహించి ఉండడేమో.. ‘ఈ పాట విని మేము ఆగగలమా?' అని అభిమానులు అంటారని. ఏ క్షణాన ఈ పాట విడుదలైందో.. కానీ ఎక్కడ చూసినా ఇదే పాట.. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధిస్తోంది. ఐదు లక్షల లైక్స్ తో ఈ పాట తెలుగు నాట సంచలనం రేపుతోంది.

మాస్ బీట్ తో రానున్న తమన్..

ఈ ఒక్క పాటతో సినిమాపై విపరీతంగా హైప్ పెరిగింది. అయితే ఈ మూవీలోని ఓ బీట్ ను ప్రస్తుతం తమన్ సోషల్ మీడియావేదికగా అభిమానులతో పంచుకున్నాడు. శివమణి డ్రమ్స్ వాయిస్తుండగా.. తమన్ కూడా అతనికి పోటీగా వాయిస్తున్నాడు. అయితే ఈ మాస్ బీట్ ఓ రేంజ్లో క్లిక్ కాగా.. ఆ బీట్ కు బన్నీ స్టెప్పులు తోడైతే ఎలా ఉంటుందోనని అభిమానులు ఊహించుకుంటున్నారు.

 మాస్ బీట్ కు బన్నీ స్టెప్పులు..

మాస్ బీట్ కు బన్నీ స్టెప్పులు..

ఎలాంటి స్టెప్పులైనా అవలీలగా చేసేసే బన్నీ.. ఇలాంటి మాస్ బీట్ అంటే మరింత రెచ్చిపోతాడన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న మంచి డ్యాన్సర్లలో బన్నీ ఒకడు. మరి ఈ మూవీలో బన్నీ డ్యాన్సులు ఓ రేంజ్లో ఉంటాయన్న తెలుస్తోంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ 2020 జనవరిలో రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X