వర్మ 'గర్ల్ ప్రెండ్స్' గురించి..శివనాగేశ్వరరావు

By Staff

Ram Gopal Varma
ఒకసారి ఊర్మిళ,మరో సారి ఆంత్రామలి,తర్వాత నిషా కొఠారి,జియా ఖాన్ ఇలా రామ్ గోపాల్ గర్ల్ ప్రెండ్స్ లిస్ట్ కి ఆపు అంతూ ఉండదు. అయితే ఆయన గర్లెప్రెండ్ వీరెవరూ కాదంటారు శివనాగేశ్వరరావు. శివ సినిమాకు పనిచేసి, తర్వాత వర్మ కార్పోరేషన్ పై మనీ చిత్రాన్ని డైరక్ట్ చేసిన ఆయన వర్మ ని గుర్తు చేసుకుంటూ..

రాముకి బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో అతనికి సంభంధాలు అంటగడుతూ రూమర్స్ షికారు చేస్తూంటారు. కానీ నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ గర్ల్ ప్రెండ్ మాత్రం సినిమానే...సినిమానే...అదే అతని గాడ్ ఫాదర్. ఆయన సినిమాని ప్రేమిస్తాడు.సినిమాను తింటాడు.సినిమాను త్రాగుతాడు. సినిమాను శ్వాసిస్తాడు.సినిమాతోనే పడుకుంటాడు.నాకు తెలిసుండి ఆయనొక్కడే రూల్స్ పెట్టగలడు..బ్రేక్ చెయ్యగలడు అంటూ ఉద్వేగంగా రామ్ గోపాల్ వర్మకి సినిమాపై ఉన్న ప్యాషన్ ని వివరిస్తూ వచ్చారు శివనాగేశ్వరరావు.

వర్మ ప్రభావం సినీ పరిశ్రమపై వివరిస్తూ...చాలా సినిమాల డిస్కషన్ లో నిర్మాత రైటర్ లని,దర్శకులని కొంచెం వర్మలా ఆలోచించవయ్యా అంటారు. అలాగే అదే నిర్మాత అదే సిటింగ్ లో మరీ వర్మలా ఆలోచిస్తున్నావు.మనకి అంత అవసరమా అంటాడు. అలా వర్మ చాలా విషయాలకి కొలమాలంగా మారాడు.కానీ అవేమీ పట్టించుకోకుండా ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అలాంటి రాము దగ్గర అసిస్టెంట్ గా పనిచేసినందుకు తనని తానూ అభినందించుకుంటానంటారు ఆయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X