twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్టరీ థ్రిల్లర్‌ శివపురం

    By Staff
    |

    ఇండియాలోని అత్యుత్తమ సినిమా టెక్నీషియన్లలో ఒకరిగా సంతోష్‌ శివన్‌కు మన పరిశ్రమలోనే కాదు. అంతర్జాతీయంగా కూడా పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. కెమెరామెన్‌ గా ఉంటూనే దర్శకుడిగా ఆయన తీసిన టెర్రరిస్ట్‌ చిత్రం హాలీవుడ్‌ దర్శకుడు స్పీల్‌బర్గ్‌ను సైతం ఆకట్టుకుని ఆయన ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో సంతోష్‌ శివన్‌ రూపొందించిన అశోక్‌ చిత్రం కలెక్షన్ల పరంగా ఫెలయినా మంచి సాంకేతిక విలువలు ఉన్న చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటువంటి సంతోష్‌ శివన్‌ రూపొందించిన మళయాల సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ చిత్రం అనంతభద్రం తెలుగులో శివపురంగా విడుదలవుతోంది.

    డబ్బింగ్‌ చిత్రాల పంపిణీదారులు శ్రీ లక్ష్మీ గణపతి ఫిలింస్‌ పతాకంపై విడుదలవుతున్న శివపురం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారంనాడు నిర్వహించారు.

    కేరళలోని సంప్రదాయాలు, అక్కడి జానపద గాథలను మిళితం చేసి ఒక విచిత్రమైన నేపథ్యాన్ని ఎంచుకుని సంతోష్‌ శివన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. క్షుద్రోపాసకులు, మార్షల్‌ ఆర్ట్స్‌ యోధులు, మంత్రగాళ్లూ, సానులూ.. మధ్య సాగే సన్నివేశాలతో, బయట ప్రపంచానికి అంతగా తెలియని ఒక విచిత్ర లోకాన్ని తెరమీద ఆవిష్కరించే చిత్రమే శివపురం.

    మళయాల హీరో పృథ్వీరాజ్‌ మంచి నటన ప్రదర్శించగా, హీరోయిన్‌ కావ్య మాధవన్‌ను ఒక రవివర్మ పెయింటింగ్‌ అంత అందంగా తెర మీద చూపించారు శివన్‌. ప్రతిభావంతుడైన కళాభవన్‌ మణి గుడ్డివానిగా నటించారు. బాలీవుడ్‌ సుందరి రియాసేన్‌ ఒక ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చి తన అందాలతో కనువిందు చేస్తుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. మళయాలంలో కనకవర్షం కురిపించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X