నేనింతే సియా గతి అంతే?
నేనింతే సియాకి మరో అవకాశం వచ్చింది. క్రిష్ రూపొందించనున్న మల్టి స్టారర్ చిత్రంలో ఆమె ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. ఇక తనకి నేనింతే తర్వాత ఆఫర్స్ వచ్చాయి కానీ అవేమి చెప్పుకోదన సంస్ధలు కానీ, దర్శకుల నుంచి కానీ కాకపోవటంతో ఒప్పుకోలేంది. అంతేగాక తనకి నేనింతే అనంతరం బాగా ఒళ్ళుతో కనపడ్డావంటూ కామెంట్స్ వినిపించాయని, అందుకే బరువు తగ్గి వస్తున్నానని చెప్తోంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ కి అటెండ్ కావల్సి ఉంటుందని క్రిష్ చెప్పారని దానికి ప్రిపేరవుతున్నానని అంది.
అలాగే వేదం చిత్రం తర్వాత తన కెరీర్ లో చెప్పుకోతగ్గ మార్పు వస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నేనింతే సినిమా జయాపజయాలు కన్నా పూరీ వంటి గొప్ప దర్శకునితో పనిచేయటం అదృష్టమని పనిలో పనిగా పొగిడేసింది. ఆమె ఎంత గొప్పగా తన పాత్ర గురించి చెప్పుకున్నా అది గ్యారింటీగా గుంపులో గోవిందంలా ఆ సినిమాలో కలిసిపోయే అవకాశముంటుంది అంటున్నారు విశ్లేషకులు. అదే నేనింతే హిట్టయి ఉంటే ఆమె కెరీర్ మరో విధంగా ఉండేదనేది నిజం అంటున్నారు.


Click it and Unblock the Notifications











