బాలయ్య కి హీరోయిన్ సమస్య?

By Staff

Balakrishna
త్వరలో బాలకృష్ణ హీరోగా చేయబోయే రెండు సినిమాలు దసరా రోజునే ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ సినిమాల్లో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనే ఆసక్తి అంతటా నెలకొంది. అలాగే ఆ దర్శక,నిర్మాతలలో కూడా ఆయన ప్రక్కన ఎవరిని హీరోయిన్ గా బుక్ చేస్తే బాగుంటుందనే విషయంపై మల్ల గుల్లాలు పడుతున్నారుట. అయితే ఈలోగా ఈ రెండింటిలోనూ ప్రియమణి మెయిన్ హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అలా చేస్తే ప్రాజెక్టు పై క్రేజ్ తగ్గుతుందని విశ్లేషకులు చెబుతూండటంతో మళ్ళీ ఆలోచనలో పడుతున్నారుట. బాలయ్య సరసన చెయ్యాలంటే కాస్త అభినయ సామర్ధ్యం ఉండాలనీ,నిండుగా కరెక్టు జోడీగా ఆనాలని వారి అభిప్రాయంట.

ఒకప్పుడు విజయశాంతి,రాధ,సిమ్రాన్,రమ్యకృష్ణ,టబు వంటి వారు హీరోయిన్స్ గా బాలయ్యకు కరెక్టు జోడీగా వెండితెరను వేడిక్కించేవారు. ఓ ప్రక్క బాలయ్య తన ఎమోషనల్ డైలాగులతో టప్పుట్లు కొట్టిస్తూంటే...మరో ప్రక్క హీరోయిన్స్ కూడా తన అంద చందాలతోనే కాకుండా నటనతో కూడా కొంత వరకూ సన్నివేశాలు పండిచేవారు. అయితే ఇప్పుడు ఆ తరహా హీరోయిన్స్ కరువయ్యారు. సీనియర్స్ అభిప్రాయం ప్రకారం సన్నివేశాలు కల్పన హీరోయన్స్ పై లీడ్ తీసుకుందామంటే సమస్య అయిపోతోందనేది వారు చెప్తున్నారు. దాంతో వారిని కథలో భాగం గా కాక గ్లామర్ పాత్రగానే చూపాల్సి వస్తోందంటున్నారు.

మొన్న ఒక్క మొగాడు చిత్రంలో నిషా కొఠారి మరీ చిన్న పిల్లలా ఉండంటం జరిగింది. పోనీ స్నేహనే కంటిన్యూ చేద్దామంటే ఆమె స్పైసీ లుక్ లేకపోవటం మాస్ ఎంటర్ టైనర్స్ కి ఇబ్బందిగా ఫీలవుతున్నారుట. దాంతో హీరోయిన్ ఎంపిక మాత్రం చాలా క్లిష్టంగా మారిపోతోందిట. మరో ప్రక్క ఈ రేస్ లో స్నేహా ఉల్లాల్, సియా కూడా ఉన్నారుట. ఐశ్వర్యారాయ్ పోలికలతో ఉండే స్నేహ ఇప్పటికే ఉల్లాసంగా ఉత్సాహంగా హిట్ తో రేస్ లో ముందుంది. అలాగే సియా పూరీ జగన్నాధ్ నేనింతే చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇద్దరకీ క్రేజ్ ఉంది. అయితే బాలయ్యకి జోడిగా కనపడాలి తేలిపోకూడదు అనే కాన్సెప్ట్ తో వీరిని పలిశీలిస్తున్నారుట.

ఎన్ని రకాలుగా ఆలోచించినా ప్రియమణి కాస్త ఒళ్ళు చేసి ఉండటం,ఈ మధ్యం నటనకు నేషనల్ అవార్డు సాధించటం తో ఆయన ప్రక్కన నిండుగా కనపడుతుందని నిర్ణయించారుట. అదే స్నేహ ఉల్లాల్ అయితే చిన్న పిల్లలా కనపడే అవకాశముందని వేరే వాళ్ళని వెతుకుదామా అన్న ఆలోచన కూడా చేస్తున్నారుట. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ని ఎన్.శంకర్ ప్రాజెక్టుకి అడుగుదామనుకున్నా ఆమె ఏడాది వరకూ బిజీ గా ఉండంటం,భారీ రెమ్యునేషన్ దూరంగా పెట్టేస్తున్నాయట. చూద్దాం ఎవరు బాలయ్యకి జోడీగా కనపడి తెరపై పోటీ ఇవ్వనున్నారో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X