twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్బ్: ‘సైజ్ జీరో’ థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మించిన చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది.

    ‘సైజ్' జీరో చిత్రం ఆడియో నవంబర్ 1న విడుదల విడుదలైంది. అదే సందర్భంలో థియేట్రికల్ ట్రైలర్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

    ఈ చిత్ర కథాంశం ప్రకారం అనుష్క భారీ లుక్ తో కనపడనుంది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌,బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌, సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డ్యాన్స్‌: రాజుసుందరం,బృంద, ఫిరోజ్‌ఖాన్‌, కాస్ట్యూమ్స్‌: ప్రశాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి.

    English summary
    Anushka's Size Zero Trailer. Size Zero has Arya and Anushka playing the lead roles ably supported by Sonal Chauhan, Urvashi, Prakash Raj, Barath and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X