మెర్సల్ లో విలన్ గా విజృంబించిన ఎస్‌జే సూర్య, 27న రానున్న తెలుగు వెర్షన్

స్పైడర్ లో అతని కౄరత్వాన్ని ఇంకా మర్చిపోకముందే. మళ్ళీ ఇంకో ప్రతినాయక పాత్రలో వచ్చేసాడు. ఎస్‌జే సూర్య నట విశ్వరూపం ఏంటో మరోసారి 'మెర్సల్' చిత్రంతో చూపించాడు.

ఎస్‌జే సూర్య దర్శకుడి నుంచి హీరోగా, ఆ తర్వాత సపోర్ట్ నటుడిగా మారిన సూర్యా ఇప్పుడు విలన్ గా కూడా అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. స్పైడర్ లో అతని కౄరత్వాన్ని ఇంకా మర్చిపోకముందే. మళ్ళీ ఇంకో ప్రతినాయక పాత్రలో వచ్చేసాడు. ఎస్‌జే సూర్య నట విశ్వరూపం ఏంటో మరోసారి 'మెర్సల్' చిత్రంతో చూపించాడు.

మహేష్ బాబు సినిమా

మహేష్ బాబు సినిమా "నాని"

తమిళ చిత్రం అయిన మెర్సల్‌లో విజయ్ హీరోగా నటించగా ఎస్ జే సూర్య విలన్ గా నటించాడు. తెలుగు.. తమిళ భాషల్లో దర్శకుడిగా తనకంటూ మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న ఎస్.జె. సూర్య, ఆ తర్వాత నటనకి ప్రాధాన్యతనిచ్చాడు. అంతకుముందు కూడా తెలుగు లో మహేష్ బాబు సినిమా నాని కి మాతృక అయిన న్యూ, చిలిపి లాంటి సినిమాల్లో హీరోగా కూడా చేసాడు.

స్పైడర్

స్పైడర్

తమిళ చిత్రం ‘ఇరైవి'లో ప్రదర్శించిన నటనతో ఎస్‌.జె. సూర్యకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో తమిళ, తెలుగు చిత్రాల్లో నటుడిగా ఆయనకు మంచి అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ హీరోగా చేసిన 'స్పైడర్' సినిమాలో శాడిస్ట్ విలన్‌గా చేశాడు.

మెర్సల్

మెర్సల్

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోయినా, ఆయన నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆయన విలన్‌గా నటంచిన 'మెర్సెల్' కూడా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో డేనియల్ పాత్రలో క్రూరమైన విలనిజాన్ని సూర్య ప్రదర్శించాడు.

నెల 27న విడుదల

నెల 27న విడుదల

సూర్య తనదైన శైలిలో మరోసారి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. దక్షిణాదిలో విలనిజం సూర్య తో కొత్త మలుపు తీసుకుంటుందీ అనే విధంగా ఎస్ జే సూర్య ఈ చిత్రంలో కనిపించాడని తమిళ సినీ అభిమానులు చెబుతున్నారు. స్పైడర్ తర్వాత ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎస్ జే సూర్యకు మరింత పేరు తెచ్చిపెడుతుందనేది మాత్రం ముమ్మాటికి నిజమని చెప్పవచ్చు. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' పేరుతో ఈ నెల 27న విడుదల కానుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X