పవన్ కళ్యాణ్ తో మరో ఎక్స్ పెరిమెంటల్ కి సిద్దమైన సూర్య..!?
'ఖుషి" వంటి సెన్సేషనల్ మూవీ చేసి పవన్ కళ్యాన్ రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఎస్ జె సూర్య పది సంవత్సరాల తర్వాత 'కొమరం పులి"తో ఒక్కసారిగా కిందకి లాగేశాడు. ఆ సినిమాని సంవత్సరాల తరబడి చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మార్చాడు. అంతటితో సూర్య ఆగదలుచుకోలేదేమో మళ్ళీ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాడట.
పవన్ కి సూట్ అయ్యే ఓ అద్భుతమైన స్ర్కిప్ట్ ని రెడీ చేశాడని తెలిసింది. పవన్ ఈ సబ్జెక్ట్ వినడం, ఓకే చెయ్యడం కూడా అయిపోయింది. అయితే డైరెక్టర్ ఎవరన్నది కన్ ఫర్మ్ అవలేదు. 'పులి' సినిమా ఫ్లాప్ అయినా ఆ దర్శకుడి టాలెంట్ మీద మాత్రం కల్యాణ్ కి ఏమాత్రం నమ్మకం తగ్గలేదంటున్నారు. అందుకే, మళ్లీ అతనితో చేయడానికి సిద్దపడుతున్నాడని చెబుతున్నారు. మరి, సూర్య ఈసారి పవన్ కల్యాణ్ ని ఏవిధంగా చూపిస్తాడో చూడాలి!


Click it and Unblock the Notifications











