'కొమరం పులి' అందుకే ఆలస్యమైంది..ఎస్ జె సూర్య
పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో రెడీ ఇయిన చిత్రం 'కొమరం పులి'. ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సూర్య మీడియాతో కలసి మాట్లాడుతూ...పవన్ పాత్ర చిత్రీకరణే ఈ కథకు కీలకం. ఆయన నటన అభిమానుల్ని ఆకట్టుకొంటుంది. అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి. రెహమాన్ నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్రతి సన్నివేశాన్నీ జాగ్రత్తగా తీశాం. నాణ్యమైన సినిమా అందించాలని మరింత శ్రద్ధ తీసుకొన్నాం. అందుకే కాస్త ఆలస్యమైంది. 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రంలో నికీషా పటేల్ హీరోయిన్ గా చేస్తోంది. శింగనమల రమేష్ నిర్మాత. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఇజ్రాయిల్‌లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











