'పులి'కి ప్లాప్ టాక్ వచ్చింది కానీ...ఎస్ జె సూర్య
'ఖుషి', 'బద్రి' సినిమాలకి కూడా తొలి వారం ఫ్లాప్ టాక్ వచ్చింది. అలాగే 'పోకిరి'కి కూడా. కానీ అవి పెద్ద హిట్టయ్యాయి కదా. సినిమావాళ్లం విమర్శకుల్లా చూస్తాం.మామూలు ప్రేక్షకులు అలా చూడరు. వాళ్లు 'పులి'ని బాగా ఆదరిస్తున్నారు.బ్యాడ్ టాక్ మారింది అంటున్నారు పులి చిత్ర దర్శకులు ఎస్.జె.సూర్య. ఆయన ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ...సినీ పరిశ్రమ వ్యక్తుల నుంచి 'పులి'కి బాడ్ రెస్పాన్స్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రెస్పాన్స్ ఎప్పుడూ అలాగే ఉంటుంది కదా. అంటే 'పులి'కి అది మంచి చిహ్నం. అన్నిచోట్లా ఫుల్స్ వచ్చాయి.
సోమవారం మార్నింగ్ షోకి కలెక్షన్లు యావరేజిగా ఉన్నా మ్యాట్నీకి మళ్లీ ఫుల్స్ అయ్యాయి. ఇక బ్యాడ్ ట్యాకే కంటిన్యూ అయితే ఈ రేంజి కలెక్షన్లు రాకూడదు. నిజాయితీతో పవన్ చేసిన ప్రయత్నానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ నగరంలో 70 థియేటర్లలో విడుదల కావడం ఓ రికార్డ్. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి స్క్రీనింగ్స్‌తో సినిమా విడుదలైంది. అందుకు తగ్గట్లే రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు వస్తున్నాయి. విడుదలైన మార్నింగ్ షోకి వచ్చిన బ్యాడ్ టాక్ సాయంత్రానికల్లా మారిపోయింది. లేనట్లయితే రెండో రోజే సినిమా షేక్ అయిపోయేది అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











