twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్.జే.సూర్య ఇక డైరెక్షన్ చేయడేమో : భాధే అయినా ఇది నిజం

    |

    కొన్ని సార్లు ఊహించకుండానే జీవితం వింత మలుపులు తీసుకుంటుంది. డాక్టర్ అవుదాం అనుకొని యాక్టర్ అయ్యాను అని చెప్పేనటులు చాలా మందే ఉన్నారు.(ప్రాస కుదిరిందని చెప్పేవాళ్ళే అధికం ఏమో) అయితే డ్qఐరెక్టర్ అయ్యాక పూర్తి యాక్టర్ గా మారటం తక్కువ సంధర్భాల్లో జరిగింది. సీనియర్ దర్షకులు కే.విశ్వనాథ్ కూడా నటుడిగా చాలాసినిమాలే చేసారు. కోడి రామకృష్ణ కూడా ఒక పూర్తి నిడివి పాత్రలో "ఆస్తి మూరెడూ-ఆశ బారెడు" అనే సిని మా లో చేసారు.

    అయితే విశ్వనాథ్ వయసై పోయాక సినిమాలోకి వచ్చినా...కోడి రామకృష్ణ నటించినా ఏదో కొంత బ్రేక్ గానే తప్ప పూర్తి కెరీర్ గా నటనని ఎంచుకోలేదు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే... నిన్న మొన్నటి దాకా దర్శకత్వం చేసిన సూపర్ డైరెక్టర్ ఎస్.జే.సూర్య ఇప్పుడు నటుడు గా మారాడు. నటనని ఎంత సీరియస్ గా తీసుకున్నాడూ అంటే... ఆల్రెడీ సెట్స్ మీదకు వెళ్ళే దాకా వచ్చిన పవన్ కళ్యాన్ లాంటి స్టార్ హీరో సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశాన్ని కూడా నటన కోసం వదులుకునేంత....

     SJ Suryah to out of Direction?
    కొంత కాలం గా ఈ తమిళ దర్శకుడు నటుడిగా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయాడు. నిజానికి మనం ఇంకా అతన్ని దర్శకుడనే అనుకుంటున్నాం కానీ తమిళనాట ఎప్పుడో ఎస్.జే.సూర్య నటుడు అనే అనుకునే స్థాయి వచ్చేసింది. అందులోనూ ఈ మధ్య 'ఇరైవి' అనే సినిమాలో తాగుబోతుగా మారిన సినీ దర్శకుడి పాత్రలో చితగ్గొట్టేశాడతను.

    మొత్తం ఇండస్ట్రీ అంతా అతడి నటన చూసి విస్తుబోయింది. ఈ సినిమా తర్వాత అగ్ర దర్శకులు చాలామంది అతడికి పాత్రలు ఆఫర్‌ చేస్తున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అంతే కాదు కేవళం తమిళం లోనే కాదు మళయాల,తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు వస్తూండటంతో ఇక దర్శకత్వాన్ని సెకెండ్ ప్రయారిటీ లోకి మార్చేసాడు. పవన్‌ సినిమా వదిలేసి వెళ్లిపోవడానికి కూడా కారణం అదే.

     SJ Suryah to out of Direction?

    'ఇరైవి' సెట్స్‌ మీద ఉండగానే సెల్వ రాఘవన్‌ లాంటి విలక్షణ దర్శకుడు ఎస్‌.జె.సూర్య కథానాయకుడిగా 'నెంజం మరప్పదిల్లై' అనే రొమాంటిక్‌ హార్రర్‌ థ్రిల్లర్‌ మొదలుపెట్టడం విశేషం. ఆ సినిమా ఫస్ట్‌ పోస్టర్‌ నిన్నే రిలీజ్‌ చేశారు. ఆ పోస్టర్లో విచిత్రమైన అవతారంలో సూర్య షాకిచ్చాడు .

    ఇవాళ ఇంకో రెండు పోస్టర్లు వదిలాడు సెల్వ రాఘవన్‌. ఆ రెండు పోస్టర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. రెండో పోస్టర్లో సూటేసుకుని చెక్కగుర్రం మీద కూర్చుని ఆడుతూ చిత్రంగా కనిపిస్తున్నాడు సూర్య. ఈ సినిమాలో రెజీనా కథానాయిక కావడం విశేషం. ఆమె పోస్టర్‌ కూడా ఒకటి రిలీజ్‌ చేశారు. అందులో ఆమె ముఖాన్ని సగమే చూపించారు. మొత్తానికి ఫస్ట్‌ పోస్టర్లతో సినిమా మీద బాగానే ఆసక్తి రేకెత్తించాడు సెల్వ. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజయ్యే అవకాశముంది.

    English summary
    SJ Surya is known as director to Tollywood audience. He is not only a director but also an actor. Basically SJ Surya is having an aim to become actor but due to situation he became director. Now he is thinking to leave Direction to Acting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X