RC 15లో ఎస్జే సూర్య రోల్ లీక్.. ఆ సెంటిమెంట్ తో ఆనందంలో ఫ్యాన్స్.. మాములుగా ఉండదట!
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న శంకర్ సినిమా గురించి సినిమా మొదలు అయినప్పటి నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో నిజానిజాలు ఏమేమి ఉన్నాయి అనేది సినిమా విడుదల అయితే చెప్పలేము కానీ ప్రచారాలకు మాత్రం ఎవరూ బ్రేకులు వేయలేకపోతున్నారు. ఇప్పటికే సినిమాలో విలన్ గా మారిన దర్శకుడు ఎస్జే సూర్య నటిస్తున్నారు అని ప్రచారం జరుగుతూ ఉండగా ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి కొత్త ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

రెండు సినిమాలతో బిజీగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా RRRలో ఒక హీరోగా నటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.

శంకర్ దర్శకత్వంలో
ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 28వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా రామ్ చరణ్ తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నారు.

RC15 గా
ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతం RC15 గా పిలుస్తున్నారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇప్పటికే ముంబై పరిసర ప్రాంతాల్లో పూర్తయింది. అక్కడ ఒక సాంగ్ షూటింగ్ కూడా చేశారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ దోసకాయల పల్లి అనే గ్రామంలో జరుగుతోంది.

ముఖ్యమంత్రి పాత్ర
ఆ సంగతి పక్కన పెడితే శంకర్‌తో రామ్ చరణ్ ప్రాజెక్ట్ లో నటుడు/దర్శకుడు SJ సూర్య భాగం అయినట్టు దాదాపు ఖరారు అయినట్టే. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. నివేదికల ప్రకారం, శంకర్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ జానర్‌కి తిరిగి వస్తున్నాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో తమిళ నటుడు ఎస్జే సూర్య ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తాడని అంటున్నారు.
Recommended Video

గొప్ప హైప్
ఈ వార్త ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గొప్ప హైప్‌ని యాడ్ చేసినట్టే చెప్పాలి. శివాజీ, ముధల్వన్ (ఒకే ఒక్కడు) వంటి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో శంకర్ తీసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఈసారి కూడా అలాంటి భారీ హిట్ కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం, RC15 మూడవ షెడ్యూల్ తూర్పు గోదావరి గ్రామాల్లో జరుగుతోంది. రామ్ చరణ్, అంజలి, శ్రీకాంత్ రాబోయే రెండు వారాల పాటు అక్కడేషూటింగ్ చేయనున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఆర్సీ 15లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











