తన వక్షోజాలు చిన్నవని కారణం చూపి టీవీ ప్రెజెంటర్ గా ఇండియాలోని ఓ పాపులర్ ఛానెల్ నిరాకరించిందని స్లమ్ డాగ్ చిన్నది ప్రీడా ప్రింటో వాపోయింది. వాషింగ్టన్ లోని కాంప్లెక్స్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ తాను స్లమ్ డాగ్ మిలియనీర్ లో హీరోయిన్ గా సెలక్ట్ కానప్పుడు అవకాశాలు కోసం ముంబయి లో తెగ తిరిగానని చెప్పుకొచ్చింది. తన కెరీర్ ప్రారంభంలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని బాధపడింది...అయితే ఇవాళ అందరూ తనని అందగత్తెగా ఆకాశానికి ఎత్తేస్తున్నారని, తను సన్నగా ఉన్ననన్నవారే అదే అందమంటున్నారని విమర్శలు చేసింది. అంతేగాక తనను ఫుల్ ఫిగర్ గా కనపడితేనే అవకాశాలు వస్తాయని చాలామంది సన్నిహితులు సైతం అన్నారని, అయితే తను ఇప్పుడున్నట్లే ఉంటేనే కంపర్ట్ గా ఫీలవుతానని చెప్పుకొచ్చింది. అలాగే తనకు హాలీవుడ్ స్టార్ లియానార్డో డిక్రాపియో తో పనిచేయాలని ఉందని తన అభిమాన స్టార్ అతనేనని చెప్పుకొచ్చింది. ఇక తనవి పెద్దవి గా ఉంటే టీవీ మీడియాలో సెటిల్ అయ్యి ఇంత పెద్ద ఆఫర్ మిస్సయ్యేదాన్నని కామెంట్ చేసింది.