పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కి స్మాల్ బ్రేక్...!
హిందీ దబాంగ్ కు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం 'గబ్బర్ సింగ్'. పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గబ్బర్ సింగ్". ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. కోకాపేటలో వేసిన ఓ సెట్ లో బ్రహ్మానందం, షాయాజీ షిండే పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది.వైవిధ్యమైన గెటప్ లో మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
తాజా సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ షూటింగ్ పొల్లాచ్చి, కేరళలో సెకండ్ షెడ్యూల్ ఆరంభించాలనుకున్నారు. కానీ ఈ షెడ్యూల్ వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పొల్లాచ్చి, కేరళలో బాగా వర్షాలు పడుతుండటం వల్లే ఈ షెడ్యూల్ ని వాయిదా వేసారని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న విషయం విధితమే..


Click it and Unblock the Notifications











