Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2011లో చిన్న బడ్జెట్‌తో అద్బుతమైన విజయం అలా మొదలైంది
2011లో విడుదలైనటువంటి అన్ని సినిమాలలో కెల్లా మొట్టమొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అలా మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టడమే కాకుండా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దాంతో అలా మొదలైంది ప్రింట్లు, ధియేటర్లు ఒక్కసారిగా పెంచడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ ఈసినిమాన్ని బాగా ఆదరిస్తున్నారని నిర్వాత దామోదర ప్రసాద్ వెల్లడించారు.
సాధారణంగా ఎప్పుడూ ఏ సినిమా చూసిన మాట్లాడని దర్శకేంద్రుడు రాఘవేంద్రారవు ఈచిత్రాన్ని చూసి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అది మాత్రమే కాకుండా చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కోట్టాలి అనే ఉద్దేశ్యం ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్‌కి లభించినటువంటి అద్బుత విజయమని ప్రశంసించారు. ఇక ఈసినిమా డైరెక్టర్ నందిని రెడ్డి మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నారు.
ఇక ఈసినిమాలో నటించినటువంటి హీరో, హీరోయిన్ ఇద్దరూ ఒకరికోకరు పోటీపడి నటించారు. ముఖ్యంగా నాని యాక్షన్ ఐతే చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా హీరోయిన్ నిత్యామీనన్ తన అందచందాలు, అభినయంతో ప్రేక్షకులను ధియేటర్లుకు బాగానే రప్పిస్తున్నారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజీని సంపాదించుకుంది అలా మొదలైంది. చివరగా ఈసినిమా నిర్మాత మాట్లాడుతూ త్వరలో మాబ్యానర్లో మరో మూడు చిత్రాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో ఒకటి పెద్ద హీరోతో ఉంటుందని, ఇంకోకటి కొత్తవారితో చేస్తామని తెలిపారు.