twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్ల గోల్ మాల్- చితికి పోతన్న చిన్న సినిమా!

    By Bojja Kumar
    |

    tollywood
    'దూకుడు", 'ఊసరవెల్లి" చిత్రాలు రికార్డుస్థాయి కలెక్షన్లు సాధించాయి. ఆ రెండు సినిమాలకు రెండేసి వారాల గ్యాప్‌ తీసుకుని ప్లాన్‌ ప్రకారం విడుదల చేయడం కూడా రెండింటికీ కలిసొచ్చిందంటున్నారు. ఇప్పుడు అదే పద్ధతిన వరసబెట్టి పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతి దాకా వరుసబెట్టి విడుదలయ్యేలా ఉన్నాయి. ఎంతలేదన్నా పెద్ద హీరోల చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా కేంద్రాలలో విడుదలచేయడం రివాజైపోయింది. పెద్ద సినిమాల ధాటికి చిన్న సినిమాలకు థియేటర్లే కరువవుతున్నాయి. చాలా చిన్న సినిమాలువిడుదలకు సిద్ధంగా ల్యాబ్‌లలో పడివున్నాయి. వాటిని ఎప్పుడు విడుదలచేయాలా అని సంబంధిత నిర్మాతలు తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. చిత్రం విడుదల ఆలస్యమైతే ఇక ఆ చిత్రం కొనుక్కోవడానికి ఎవరూ ముందుకురావడంలేదని ప్రచారం మొదలెడతారు. దానితో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి చిన్ననిర్మాతలు ఎదుర్కొంటున్నారు.

    నాని నటించిన 'పిల్లజమిందార్‌" చిత్రం రీసెంట్‌గా విడుదలై చాలా మంచి చిత్రంగా అభినందనలు అందుకుంటోంది. అయితే ఎక్కువ థియేటర్లలో విడుదలచేసుకోలేని దుస్థితి ఏర్పడింది. దీపావళికి విడుదల కాబోతున్న సూర్య నటించిన తమిళ డబ్బింగ్ సినిమా 'సెవన్త్‌ సెన్స్‌" చిత్రం కూడా చాలా థియేటర్లు ఉంటాయి. కానీ తెలుగునాట వ్యయప్రయాసలకోర్చి సినిమా తీసిన చిన్న నిర్మాతకు థియేటర్లే దొరకక విడుదల తేదీని జాప్యం చేసుకోవాల్సిన దుస్థితి కలుగుతోంది.

    వరుణ్‌సందేశ్‌, ప్రీతికారావులు నటించిన 'ప్రియుడు", శ్రీకాంత్‌ హీరోగా నటిస్తున్న చరిత్రాత్మక చిత్రం 'దేవరాయ", జగపతిబాబు, ప్రియమణిలు నటించిన 'క్షేత్రం" సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద హీరోల చిత్రాలతో సమానస్థాయి థియేటర్లు కాకపోయినా చిన్న సినిమాలకు కూడా కావలసిన డిమాండ్‌లో థియేటర్లు సమకూర్చగలిగితే చిన్న నిర్మాతలు కూడా చాలా హ్యాపీగా రాబోయే దీపావళి, సంక్రాంతి పండుగలను జరుపుకుంటారు.

    English summary
    So many small Budget movies ready to release, But theater are not avalable.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X