ముగిసిన సినీ వివాదం

''పర్సెంటేజీ విధానంతో సినిమాలు ప్రదర్శిస్తామన్నందుకు కృతజ్ఞతలు. హౌస్‌ఫుల్ కలెక్షన్లు ఉన్నప్పుడు 75 శాతం నిర్మాతలకు, 25 శాతం వాటా ప్రదర్శనదారులకు దక్కుతుంది. వసూళ్లు తగ్గే కొద్దీ ఈ శాతాల్లో మార్పులుంటాయి. మా కృషి ఫలించినందుకు ఆనందంగా ఉంది. సినిమా వాళ్లమంతా సోదరులం. ఎవరినైనా కించపరిచి ఉంటే అది కేవలం బాధతోనే కానీ.. వేరే ఉద్దేశంతో కాదు. చిన్న సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లి మా సత్తాను నిరూపించుకుంటామ''ని నిర్మాతలు పేర్కొన్నారు. ఈసమావేశంలో నిర్మాతలు సంగిశెట్టి దశరథ, చదలవాడ శ్రీనివాసరావు, జీవిత, టీవీడీ ప్రసాద్, ఆర్.కె, నట్టికుమార్, వడ్డాది రమేష్, గంటా శీను తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











