»   » సొంతింట్లోనే...చిరంజీవి 150కి అనుకోని అడ్డంకి!

సొంతింట్లోనే...చిరంజీవి 150కి అనుకోని అడ్డంకి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్.

ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లొ తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా చిరంజీవితో చేస్తున్ తెలుగు వెర్షన్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది. రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగినా.... సినిమా మళ్లీ వాయిదా పడక తప్పడం లేదు.

Also Read: శ్రీజను చేసుకోబోయే కళ్యాణ్ ఇతనే(రేర్ ఫొటోలు)

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఇటీవలే సెట్టయింది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి కూడా మొదలైంది. మార్చి 28న వివాహ ముహూర్తం నిశ్చయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి 150వ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

శ్రీజ పెళ్లి డీటేల్స్...
తాజాగా చిరంజీవి కాబోయే అల్లుడి గురించి వివరాలు బయటకు లీకయ్యాయి. శ్రీజ పెళ్లాడే వ్యక్తి పేరు కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడని టాక్. యూఎస్ఏలో బిజినెస్ మేన్ గా సెటిలైన ఎన్నారై. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి..

చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే.

శ్రీజ వివాహం

శ్రీజ వివాహం

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఇటీవలే సెట్టయింది. దీంతో సినిమా వాయిదా పడింది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి కూడా మొదలైంది.

తప్పదు

తప్పదు

కూతురు వివాహ వేడుక కాబట్టి చిరంజీవి 150 సినిమా వాయిదా పడక తప్పలేదు.

శ్రీజ, కళ్యాణ్

శ్రీజ, కళ్యాణ్

శ్రీజ పెళ్లాడే వ్యక్తి పేరు కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడని టాక్. యూఎస్ఏలో బిజినెస్ మేన్ గా సెటిలైన ఎన్నారై. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా.

English summary
Small hurdle for Megastar's 150th film and Chiranjeevi must be more than glad for getting his 150th delayed for it. Its his most pampered young daughter Srija's wedding on March 28th at Hyderabad. Srija is getting married to Businessman Captain Kishan's son Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu