అరవింద్ నుంచి రక్షణ కల్పించండి

అనకాపల్లిలో అరవింద్ తన పలుకుబడి, డబ్బును వినియోగించి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అక్కడ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే విశాఖ, అనకాపల్లిల్లోని గీతా ఆర్ట్స్ కార్యాలయాలు, ఆ సంస్థ క్యాషియర్ నాగరాజు, అల్లు అరవింద్ సోదరి, ఠాగూర్ నిర్మాత మధు, చిరంజీవి మేనేజర్ మోహన్ నివాసాల్లో తనిఖీలు చేయాలన్నారు. అనకాపల్లిలో పీఆర్పీ వాహనాలను పోలీసులు సక్రమంగా తనిఖీ చేయడం లేదని ఆరోపించారు. అలాగే సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు అల్లు అరవింద్...ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్నారని వారు ఆరోపించింది.
డబ్బులకు టిక్కెట్లు అమ్ముకు న్నారని ఆ పార్టీకే చెందిన జిల్లా కన్వీనర్లు, జాయింట్, కో కన్వీనర్లు విలేకరుల సమక్షంలో బహిరంగంగా చేసిన ఆరోపణలు పలు పత్రికలు ప్రచురించాయని, టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయని ఈ బృందం సీఇఓకు వివరించింది. ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి శోభారాణి ఆదివారం మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో మునెమ్మ వంటి నేతలకు ఖర్చు పెట్టడానికి డబ్బులు వసూలు చేయాల్సి వస్తోందని వెల్లడించిన విషయాన్ని సీఇఓ దృష్టికి తీసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











