డబ్బింగ్ సినిమాలపై సీఎంకు ఫిర్యాదు
డబ్బింగ్ చిత్రాల జోరు రోజు రోజుకు ఎక్కువవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఛైర్మన్ నట్టి కుమార్ సారథ్యంలో దాదాపు 75 మంది నిర్మాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. డబ్బింగ్ చిత్రాల వల్ల పరిశ్రమకు వాటిల్లుతున్న నష్టాన్ని గురించి వివరించారు.
డబ్బింగ్ చిత్రాల వల్ల చిన్న సినిమాలకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే ఆ డబ్బింగ్ సినిమాలకు పన్ను రెట్టింపు చేయాలని, అలాగే చిన్న సినిమాలకు వినోదపు పన్ను మినహాయించాలని, రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ఆ వినతి పత్రంలో కోరినట్లు నట్టి కుమార్ చెప్పారు.
దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, ముత్యాల రామదాసు, మోహన్‌గౌడ్,బాలరాజు తదితరులు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో మంత్రుల ఏరాసు ప్రతాపరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి కూడా అక్కడే ఉన్నారు.


Click it and Unblock the Notifications











