twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాకు థియేటర్లు ఇవ్వలేదో రచ్చరచ్చే!

    By Bojja Kumar
    |

    ఈ సంక్రాంతికి మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ హీరోలుగా వస్తున్న భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమా ఏకంగా 1100 ప్రింట్లతో విడుదలవుతుంటే, బాడీగార్డు 1000 థియేటర్లను బుక్ చేసుకుంది. ఇక రవితేజ నిప్పు కూడా దాదాగా ఈ రెండు సినిమాలకు అటూ ఇటు ప్రింట్లతో విడుదలవుతోంది. చివరకు తమిళ డబ్బింగ్ సినిమా, విక్రమ్ నటించిన 'వీడింతే' ఈ సంక్రాంతికి వందల సంఖ్యలో థియేటర్ల రిజర్వు చేసుంది. ఈ పెద్ద సినిమాలన్నింటినీ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన బడా నిర్మాతలు సొంతం చేసుకుని, థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకునా ఎక్కువ ప్రింట్లతో విడుదల చేస్తున్నారు.

    ఈ పరిణామాలతో చిన్న సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెద్ద నిర్మాతలంతా థియేటర్లను బ్లాక్ చేయడంతో సినిమాలు విడుదల చేసుకోలేని పరిస్థితి. దీంతో చిన్న నిర్మాతలంతా బుధవారం ఫిల్మ్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. చిన్న సినిమాలకు కూడా తగిన సంఖ్యలో థియేటర్ల కేటాయింపు చేయాలని, థియేటర్ల సమస్య పరిష్కరం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. చిన్న నిర్మాతలతో ఆందోళన విరమింప చేసేందుకు ఫిల్మ్ చాంబర్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    English summary
    Small Producers of Telugu Films staged dharna in protest against non availability of theatres for their films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X