ఛీ..చిరంజీవి పరువు తీశారు

చిన్నచిత్రాల మండలి చిరంజీవిని లక్ష్యం చేసుకుని తమ సమావేశాన్ని సాగించింది. మరికొంతమయితే చిరంజీవి పరిశ్రమలో తనని నిలబెట్టిన దర్శక, నిర్మాతలకు ఏం చేసాడో చెప్పమనండి అని ఎద్దేవా చేసారు. అలాంటి వాడు ప్రజలకు ఏదో చేస్తాడని ఆశించటం అనవసరం అన్నారు.
సభలో పాల్గొన్నవారంతా చిరంజీవికి రాజకీయాలు ఎందుకూ...అని విమర్శల వర్షం కురింపించాయి. సమావేశంలో పాల్గొన్న ఎఫ్ డీసి ఛైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారికి చిత్ర పరిశ్రమ కష్ట నష్టాలు బాగా తెలుసునని, పరిశ్రమను ఆదుకునేందుకు ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముగింపు ప్రసంగంలో కొందరు వక్తలు మాట్లాడుతూ, మెగాస్టార్ గా రాజకీయాలలో ప్రవేశించిన చిరంజీవి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ఇమేజ్ ముందు ప్లాప్ స్టార్‌గా నిలిచారనీ, వైఎస్ సూపర్ స్టార్‌గా నిలిచారని ముఖ్యమంత్రిపై ప్రశంసలు జల్లు కురిపించారు.


Click it and Unblock the Notifications











