twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లి తెర హాస్య నటుడి దొంగ వేషాలు.. షాక్ తినాల్సిందే, ఆటకట్టించిన పోలీసులు!

    |

    రంగుల ప్రపంచం మీద మోజుతో చాలా మంది సినీ ఇండస్ట్రీలో స్థిరపడాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ సక్సెస్ సాధించేది కొంత కొంత మంది మాత్రమే. సినీ ఇండస్ట్రీలో అవకాశం రావడమే గగనం. ఒకవేళ అవకాశం వచ్చినా దానిని నిలబెట్టుకుని ఎదగాలంటే చాలా కష్టపడాలి. సినీ ఇండస్ట్రీలో ఉంటూ చాలీ చాలని డబ్బులతో జీవనం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఆ కోవలోకి చెందినదే బి నాగరాజు అలియాస్ నరేందర్ కథ. ఓ ప్రముఖ టివి షోలో హాస్య నటుడుగా పనిచేస్తున్న నాగరాజు వ్యసనాలకు అలవాటు పడి దొంగగా మారాడు. అడ్డు అదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతుండటంతో పోలీస్ లు ఆటకట్టించారు. నాగరాజు సూర్య పేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన వాడు.

    హాస్య నటుడిగా ఎదగాలని

    హాస్య నటుడిగా ఎదగాలని

    సినీ ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో నాగరాజు హాస్య నటుడిగా ఎదగాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా ఓ టివి షో లో హాస్య నటుడిగా కొంతకాలంగా నాగరాజు పనిచేస్తున్నాడు. టివి షో లో నటిస్తూనే సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.

    వ్యసనాలకు అలవాటు పడి

    వ్యసనాలకు అలవాటు పడి

    ఈ క్రమంలో నాగరాజు మద్యం, ధూమపానం వంటి వ్యసనాలకు బాగా అలవాటు పడ్డాడు. వ్యసనాలు పెరగడంతో నాగరాజు దగ్గర ఉన్న డబ్బు సరిపోయేది కాదు. అప్పటినుంచే అడ్డదారులు తొక్కాలనే ఆలోచన నాగరాజులో మొదలైంది.

    చదువు మానేసి

    చదువు మానేసి

    నాగరాజు డిగ్రీ విద్యని మధ్యలో మానేసి సెంట్రిక్ కార్మికుడిగా కొంతకాలం పనిచేసాడు. వివాహం చేసుకున్న తరువాత నాగరాజు 2016 లో హైదరాబాద్ కు వచ్చి సినీరంగంపై ఆసక్తితో సినిస్టూడియోల్లో వివిధ విభాగాల్లో పనిచేశాడు. చివరకు ఓ టివి షోలో హాస్య నటుడిగా అవకాశం దక్కించుకున్నాడు.

    చెడు ఆలోచనలతో గాడి తప్పిన జీవితం

    చెడు ఆలోచనలతో గాడి తప్పిన జీవితం

    నాగరాజులో మొదలైన చెడు ఆలోచనలతో అతడి జీవితం అదుపు తప్పింది. ఈ క్రమంలోనే నాగరాజు ఇటీవల కాలంలో దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో 16 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ ప్రాంతంలో చోరీలు ఎక్కువవుతుండడంతో విచారణ మొదలుపెట్టిన పోలీస్ లు నాగరాజు ఆట కట్టించారు.

     షాక్ కి గురిచేసే నిజాలు

    షాక్ కి గురిచేసే నిజాలు

    చైతన్య పురి పోలీస్ లు నాగరాజుని అదుపులోకి తీసుకుని షాక్ కి గురి చేసే నిజాలు బయట పెట్టారు. నాగరాజు నాలుగు బైకులు, దాదాపు 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 310 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. నాగరాజుని అదుపులోకి తీసుకున్న పోలీస్ లు అతడిని రిమాండ్ కు తరలించారు.

    English summary
    Small screen comedian arrested for various crimes. Shocking facts revealed by Police
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X