‘ఐ’ లొల్లి: దర్శకుడు శంకర్‌కు నటి బహిరంగ లేఖ
హైదరాబాద్: శంకర్ ‘ఐ' చిత్రంలో ట్రాన్స్‌జెండర్ ఉమెన్స్‌ను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని విమర్శిస్తూ సౌతిండియా నటి, రచయిత, ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ స్మైలీ విద్య అలియాస్ స్మైలీ బహరింగలేఖ సంధించారు. శంకర్ చిత్రంలో కొన్ని సీన్లు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని కించ పరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
శంకర్ సినిమా అంటే తమకు ఎంతో గొప్పగా ఉంటుందని ఊహించుకున్నాం. కానీ ఇది గొప్ప సినిమా కానే కాదు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే సినిమా అయినా గొప్ప సినిమా కానే కాదు అంటూ ఆమె తీవ్ర విమర్శలు చేసారు. ఈ లేఖ ఇపుడు తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమాలో సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ పాత్ర ‘ఓస్మా'ను చిత్రీకరించిన తీరు తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు. శంకర్ ఇంటి వద్ద, సెన్సార్ బోర్డు ఆఫీసు వద్ద ధర్నా చేస్తామని చెన్నై సిటీకి చెందిన ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శంకర్ ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.
‘ఐ' సినిమాలో ఓస్మా పాత్రను ఓజాస్ రజనీ పోసించారు. ఓజాస్ రజనీ ఐశ్వర్యరాయ్ తో పాటు పలవురు బాలీవుడ్ స్టార్స్ స్టైలిస్ట్ గా పని చేసారు. అయితే ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చిత్రీకరించడంపై ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు. దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్దపడ్డారు.
ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించాగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంద్రన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా ఓపెనింగ్స్ బావున్నాయని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











