twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాస్త డిఫెరెంట్‌గా స్మిత.. ఈ సారిలా కానిచ్చేసింది

    |

    మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాల అంటూ రీమిక్స్ సాంగ్ తో శ్రోతలకు బాగా దగ్గరైంది పాప్ సింగర్ స్మిత. కొద్దీ రోజుల క్రిందట పాటలతో, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈమె ఆ తర్వాత తన పాపులారిటీని కోల్పోయింది. ఒకప్పుడు తెలుగులో రీమిక్స్ పాటలంటేనే స్మిత పాటలు అన్నంతగా ఉండేది. కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లో పాత పాటలను నేరుగా రీమిక్స్ చేసి వాటికి ఈ తరం హీరోహీరోయిన్లతో స్టెప్పులేపిస్తుండటంతో మెల్ల మెల్లగా స్మిత ఇమేజ్ పడిపోయింది. దీంతో రూట్ మార్చేసిన స్మిత ఇప్పుడు భక్తి పాటను ఎంచుకుంది.

    సింగర్ అన్నాక అన్ని పాటలు చేయాలని అనుకుందో లేక ఎలాగోలా తిరిగి తన పాపులారిటీ తెచ్చుకోవాలని ప్లాన్ చేసిందో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది పాప్ సింగర్ స్మిత. ఫోక్ సాంగులతో హల్చల్ చేసిన ఆమె తాజాగా భక్తి గీతాన్ని ఎంచుకోవడం ఆసక్తికర అంశంగా మారింది. ఇక ఈ పాట విషయానికొస్తే.. విష్ణు సహస్ర స్తోత్రాన్ని తనదైన శెలిలో ఆలపించిన, 46 నిమిషాల నిడివి గల వీడియో సీడీని రిలీజ్ చేసింది స్మిత. ఈ వీడియోలో తెలుగు, ఆంగ్ల భాషల్లో స్తోత్రాలను సబ్ టైటిల్స్‌లో చూపిస్తూ అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ శ్లోకాల సీడీని తిరుమల నుంచి ఆమె ప్రేక్షకులకు అందించడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

     Smitha changed her route

    ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఓ ట్వీట్ పోస్ట్ చేసింది స్మిత. ''ఈ వీడియోకు సంబంధించిన రెండో వెర్షన్ లను ఈ నెల 25న విడుదల చేస్తాం. విభిన్నమైన నృత్యాలతో 3.45 నిమిషాల నిడివితో ఈ వీడియో ఉంటుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి అమెరికాలోని డాలస్‌లో ఈ వీడియోను విడుదల చేయనున్నారు. కనుమరుగవుతున్న అలనాటి భక్తిగీతాలను గుర్తు చేసేందుకే ఈ సీడీని విడుదల చేశాం. మరో సీడీని కూడా ప్రేక్షకులకు అందించబోతున్నాం. నాతో పాటు మీరూ విష్ణువు వెయ్యి నామాలను పఠించండి'' అని స్మిత ఆ ట్వీట్‌లో పేర్కొంది.

    Read more about: స్మిత smitha pop singer
    English summary
    Pop Singer Smitha comes with Vishnu sahasra vedio. This vedio length is 46 minutes. In diffrent way Smitha surprize audians.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X