»   »  నాగ్ కి అసంతృప్తి మిగిల్చిన స్మిత

నాగ్ కి అసంతృప్తి మిగిల్చిన స్మిత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Smitha
హాయరబ్బా,మసకమసక చీకటిలో వంటి ఆల్బమ్స్ ద్వారా ఇక్కడా పాప్ తరహా సంగీతాన్ని పాపులర్ చేసి ఎదుగుదామనుకున్న స్మిత తన ఆడియా సేల్స్ అనుకున్న రేంజిలో లేకపోవటంతో నిరాశపడింది. సర్లే అని కొంత గ్యాప్ తీసుకుని,భారీ పబ్లిసిటీతో స్మిత తన పేరుతోనే ఆల్బమ్ ని రిలీజ్ చేసింది. సేమ్ టు షేమ్ సేల్స్. దాంతో మరో సారి డీలా పడ్డ ఆమెకు నాగార్జున పిలిచి తన మాటీవీలో ఓ రియాలిటీ పోగ్రాం చేయమని ఆఫర్ ఇచ్చాడు.

అందులోనూ ప్రతీ ఛానెల్ లో ఈ తరహా పోగ్రామ్స్ చేసి టీఆర్పీ రేటింగ్ లు పెంచుకుంటున్నారుగా యూత్ లో క్రేజ్ ఉన్న ఆమె పర్యవేక్షణలో చేస్తే మరీ క్రేజ్ వస్తుందని ఆశించాడు. అలాగే ఖాళీగా ఉన్న స్మిత కూడా కాదనకుండా కమిటయ్యింది. కష్టపడి డాన్స్ విత్ మి అనే పోగ్రాంని రూపొందించింది. అయితే ఆ పోగ్రాం కూడా చప్పగానే సాగింది. అక్కడికీ ఆమే డాన్స్ లు వేసి మరీ కృషి చేసింది. అయినా టీఆర్పీలు అస్సలు పెరగటం లేదు.

దాంతో మంత్లీ రిపోర్టు చూసే నాగ్ నాలుక్కరుచుకుని స్మితని భారీగానే మందలించాడని వినికిడి. అసలు స్మితకు హైదరాబాద్ లో తప్ప టీవీ అధికంగా చూసే టౌన్లు,పల్లెలలో క్రేజ్ లేకపోవటం మైనస్ అయి నిలిచిందని ట్రేడ్ విశ్లేషకులు ఆయనకు రిపోర్టు ఇచ్చారని సమాచారం. ఈ నేపద్యంలో నాగ్ ఆ పోగ్రాంని ఆపుతాడా కొనసాగిస్తాడో లేదో గానీ స్మిత మాత్రం పోగ్రామ్ మధ్యలో ఈ మధ్య కన్నీరు పెట్టుకుని మరీ ఎమోషన్స్ తో ఆడుకునే ప్రయత్నం చేయటం జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X