మహేష్ మాట్లాడటంతో క్రేజ్ వచ్చింది
మావయ్య సినిమా చూసి బావుందని మెచ్చుకున్నారు. మావయ్య, మహేష్ ఈ సినిమా గురించి మాట్లాడటంతో ప్రాజెక్ట్‌కు క్రేజ్ వచ్చింది అంటున్నారు సుధీర్ బాబు. మహేష్ బాబు బావ అయ్యిన సుధీర్ బాబు తాజా చిత్రం 'ఎస్ఎంఎస్'('శివ మనసులో శృతి'). వేగ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సమర్పిస్తోంది. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు ఇలా స్పందించారు. ఇక 'ఎస్ఎంఎస్' గేమ్‌ను నాని విడుదల చేశారు. నాని మాట్లాడుతూ "ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ నాకు తెలిసే జరిగింది. సుధీర్ తపనతో కృషి చేశాడు'' అన్నారు.
మొబైల్ అప్లికేషన్‌ను వీరుపోట్ల, వెబ్‌సైట్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను శివాజీ విడుదల చేశారు. "పాటల పిక్చరైజేషన్ బావుంది. విక్రమ్‌రాజు మంచి వ్యక్తి. సుధీర్ నటన బావుంది'' అని వీరుపోట్ల, శివాజీ చెప్పారు. తాతినేని సత్య మాట్లాడుతూ "ఇది నా రెండో చిత్రం. సినిమా నచ్చితే ఎస్ఎంఎస్ చేయండి'' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. సుధీర్ బాబు కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త.అతను మొదట చేసిన చిత్రం 'ఏమాయ చేసావె'. అందులో సమంత అన్నగా చేసాడు.


Click it and Unblock the Notifications











