మహేష్ బాబు బావ... శివ మనసులో శృతి
ఈ మధ్య తెలుగులో సినిమా టైటిళ్లు చాలా వెరైటీగా పెడుతున్నారు. ఈ క్రమంలో...ఎస్‌ఎంఎస్ పేరుతో ఒక సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు కృష్ణ మేనల్లుడు సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నాడు. 'ఎస్‌ఎంఎస్' అంటే 'శివ మనసులో శృతి'. సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్‌బీ చౌదరి సమర్పణలో వేగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్, హనీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విక్రమ్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ 'ఇటీవల దుబాయ్‌లో జరిగిన చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది. అన్ని వర్గాలను అలరించే ఈ ప్రేమకథలో కుబుంబ భావోద్వేగాలు కూడా మేళవించి దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. తప్పకుండా సుధీర్ ఈ చిత్రంలో మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు' అన్నారు. కసంద్ర, రోహిణి, సుబ్బరాజు, చంటి, వెన్నెల కిషోర్, హేమంత్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వ గణేష్, సినిమాటోక్షిగఫీ: చిట్టిబాబు, మాటలు: నంద్యాల రవి.
తన మామయ్య కృష్ణ, బావ మహేష్ బాబు స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టిన సుధీర్ బాబు ఎంత మేరకు కృష్ణ వారసత్వం పేరు నిలబెడతాడో? చూడాలి.


Click it and Unblock the Notifications











