పాములతో మజా చేస్తున్న శ్రద్దాదాస్
పబ్లిసిటీ చేసుకోవటానికి ఎప్పుడూ ఏదో విషయాన్ని వెతుక్కునే శ్రద్దాదాస్ ఇప్పుడు పాముల గురించి మొదలెట్టింది. తాజాగా ఆమె 'డ్రాకులా' అనే త్రీడి చిత్రంలో చేస్తోంది. అందునిమిత్తం ఆమె కేరళలోని ఓ అడవిలో పాముల మధ్య డాన్స్ చేసింది. ఈ విషయం గురించి ఆమె మీడియా తో కంటిన్యూగా చెప్తూనే ఉంది. సినిమాకే కాదు తనకీ పబ్లిసిటీ వచ్చేటట్లు చూసుకుంటోంది.
పాముల విషయమై ఆమె మాట్లాడుతూ..''పాములంటే నాకున్న భయం మాయమైంది. మొన్న మొన్నటివరకు పాముని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోయేదాన్ని. కానీ ఇప్పుడు చూడండి... పాముని ఎంత ధైర్యంగా పట్టుకున్నానో'' అంది శ్రద్ధాదాస్. ఆమె చేతిలో ఓ పాముని పట్టుకుని స్టిల్ ఇస్తూ ఈ కబుర్లు చెప్తోంది. మలయాళ దర్శకుడు వినయన్ దర్శకత్వంలో మలయాళం, తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతున్న 3డి చిత్రం ఇది.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలోని ఒక అడవిలో జరుగుతోంది. ఈ అడవిలో లెక్కలేనన్ని పాములు ఉంటాయి. ఈ విషయం గురించి శ్రద్ధాదాస్ చెబుతూ -''నేను నటిస్తున్న తొలి 3డి చిత్రం ఇది. ఈ చిత్రం కోసం ఇటీవల కేరళలోని అడవిలో ఉన్న ఒక పాము గుడిలో షూటింగ్ చేశాం. సీన్ గురించి దర్శకుడు వివరించేటప్పుడు నిజమైన త్రాచుపాములతో షూటింగ్ చేయాలన్నారు.
ఆ మాటలు వినగానే వెన్నులో వణుకు పుట్టింది.
ఎందుకంటే నాకు పాములంటే విపరీతమైన భయం. ఆ భయాన్ని బయటికి కనబడనివ్వకుండా చుట్టూ పాములు ఉంటే మధ్యలో నిలబడి డాన్స్ చేయాలన్నప్పుడు కంగారు పడ్డాను. నాకు నేను ధైర్యం చెప్పుకుని సీన్‌లోకి ఎంటరయ్యాను. చుట్టూ పాములున్నాయనే విషయాన్ని మర్చిపోయి డాన్స్ చేశాను. ఈ షూటింగ్‌తో నాకు పాములంటే ఉన్న భయం పోయింది. పాముల నేపథ్యంలో ఇంకా చాలా సన్నివేశాలు తీయాలని దర్శకుడు అన్నారు. ఈసారి భయం పుట్టలేదు. హాయిగా నవ్వేశాను అంది.


Click it and Unblock the Notifications











