నాగార్జునతో సరసమాడటానికి మళ్ళీ స్నేహా..
నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా స్నేహా కన్ఫర్మ్ చేసారని సమాచారం. త్వరలో ప్రారంభమయ్యే చిత్రానికి 'రాజన్న' అనే టైటిల్ ని పెట్టారు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. నాగార్జున సెకెండాఫ్ లో కనిపించే ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. నాగార్జున కనపించే ఎపిసోడ్స్ మొత్తం విజయేంద్రప్రసాద్ కుమారుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరక్ట్ చేయనున్నారు. తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుందని యాక్షన్ ప్రధానంగా రూపొందుతుందని సమాచారం. ఇక నాగార్జున ప్రస్తుతం వీరూపోట్ల దర్శకత్వంలో కామాక్షి ఎంటర్ ప్రైజస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. అనుష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక స్నేహా...బాలకృష్ణతో చేసిన పాండురంగడు తర్వాత నటించే చిత్రమిదే. అలాగే స్నేహా గతంలో నాగార్జున సరసన శ్రీరామదాసు చిత్రంలో చేసింది.


Click it and Unblock the Notifications











