twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమిత రూటులో నే స్నేహ

    By Staff
    |

    హోమ్లీ హీరోయిన్ గా పాపులర్ అయిన స్నేహ తాజాగా నమిత రూటులో ప్రయాణం పెట్టుకుంది. ఆమె లాగే ఒళ్ళు తగ్గించే పనిలో పనిలో పడింది. నమిత కష్టపడి ఏడు కేజీలు తగ్గించినట్లే తాను కూడా డైటింగ్ చేసి ఏడు కేజీలే తగ్గానంటోంది. ఆమె లాగే గ్లామర్ ప్రదర్శన కూడా చేస్తానంటూ ముందుకొస్తోంది. అంతేగాక ఈ విషయం అందరూ గుర్తించాలని స్టేట్ మెంట్స్ సైతం ఇస్తోంది. కేవలం తిండిని అదుపు చేసుకుంటేనే బరువు తగ్గడం కుదురుతుందని స్వీయానుభవంతో చెబుతోంది స్నేహ. "రాత్రికి రాత్రి ఏవేవో వ్యాయామాలు చేసి నాజూగ్గా తయారు కావాలంటే కుదరదు. నా వరకు నేను ఎనిమిది నెలలు కష్టపడ్డాను. ఏడు కేజీలు తగ్గాను. నిద్రలేచి వ్యాయామాలు చేసి పగలంతా కొవ్వు పదార్ధాలను తింటుంటే ప్రయోజనం ఉండదు. అందుకే సరైన డైట్‌ తీసుకుంటూ క్రమపద్ధతిలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది" అని తెలిసిన వారందరికీ చెబుతోందీ భామ. ఇవన్నీ నేను తగ్గాను నా వంక చూడండి అని ఆఫర్స్ అడగటానికే అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X