Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నమిత రూటులో నే స్నేహ
హోమ్లీ హీరోయిన్ గా పాపులర్ అయిన స్నేహ తాజాగా నమిత రూటులో ప్రయాణం పెట్టుకుంది. ఆమె లాగే ఒళ్ళు తగ్గించే పనిలో పనిలో పడింది. నమిత కష్టపడి ఏడు కేజీలు తగ్గించినట్లే తాను కూడా డైటింగ్ చేసి ఏడు కేజీలే తగ్గానంటోంది. ఆమె లాగే గ్లామర్ ప్రదర్శన కూడా చేస్తానంటూ ముందుకొస్తోంది. అంతేగాక ఈ విషయం అందరూ గుర్తించాలని స్టేట్ మెంట్స్ సైతం ఇస్తోంది. కేవలం తిండిని అదుపు చేసుకుంటేనే బరువు తగ్గడం కుదురుతుందని స్వీయానుభవంతో చెబుతోంది స్నేహ. "రాత్రికి రాత్రి ఏవేవో వ్యాయామాలు చేసి నాజూగ్గా తయారు కావాలంటే కుదరదు. నా వరకు నేను ఎనిమిది నెలలు కష్టపడ్డాను. ఏడు కేజీలు తగ్గాను. నిద్రలేచి వ్యాయామాలు చేసి పగలంతా కొవ్వు పదార్ధాలను తింటుంటే ప్రయోజనం ఉండదు. అందుకే సరైన డైట్ తీసుకుంటూ క్రమపద్ధతిలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది" అని తెలిసిన వారందరికీ చెబుతోందీ భామ. ఇవన్నీ నేను తగ్గాను నా వంక చూడండి అని ఆఫర్స్ అడగటానికే అంటున్నారు.