సింగపూర్‌లో స్నేహను ముట్టడించిన అభిమానులు
దొండపండు పెదాలు. ముత్యాల వంటి దంతసిరి గల స్నేహ నవ్వితే చాలు నవరత్నాలు రాలిపడుతున్నట్టు ఉంటుంది. ఆమెకు ఇప్పటికే అసంఖ్యాకమైన అభిమానులు ఏర్పడ్డారు. సింగపూర్‌లో ఇటీవల ఒక షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ఆమె అక్కడ గుమికూడిన అభిమానుల సంఖ్యను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె కారు ఆ షాపింగ్ మాల్‌కు చేరుకోగానే ఆమెను దగ్గరగా చూడడానికి అభిమానులు కారు చుట్టూ గుమికూడారు. ఆమె కారు దిగితే అభిమానుల సందోహంతో తొక్కిసలాట జరుగుతుందని నిర్వాహకులు గుర్తించారు. వారి సూచన మేరకు ఆమె చాలా సేపు కారులోనే ఉండిపోయింది. చివరికి జనాన్ని అదుపు చేయడానికి నిర్వాహకులు సింగపూర్ కమెండోలను పిలిపించారు. పోలీసు కమెండోలు వచ్చి ఆమెను జాగ్రత్తగా వేదిక మీదికి తీసుకెళ్ళారు. సింగపూర్‌లో కూడా తనకింత మంది అభిమానులు ఉంటారని ఊహించలేదని ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించింది.


Click it and Unblock the Notifications