Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నాగచైతన్య తో ఆమె కూడా
నాగచైతన్యను పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో శ్రేయ ధన్వంతరి మరో ముఖ్యమైన పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మధుర శ్రీధర్ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న స్నేహగీతం చిత్రంలో చేస్తోంది. ఆ స్టిల్స్ చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఆమెను తమ సినిమాకు అడిగినట్లు తెలుస్తోంది. శ్రేయా ధన్వంతరి క్రితం సంవత్సరం మిస్ ఫెమీనా రన్నర్ గా సెలక్టయింది. ఇక నాగచైతన్య చిత్రం అమృతసర్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
అందులో అతనికి జోడీగా ఒకప్పటి అందాల తార రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంతో వాసు వర్మ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కానున్నాడు.బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేసిన వాసు వర్మ పై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో జె.డి చక్రవర్తి విలన్ గా చేస్తున్నాడు. కాలేజి బ్యాక్ డ్రాప్ లో నడిచే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. అనూష్క ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ లో చేస్తోంది.