స్నేహ... ఇది టూమచ్ అనిపించటం లేదూ
హైదరాబాద్: 'ఇలాంటి పాత్రలు ఎందుకు ఎంచుకుంటున్నారు' అంటూ కొందరు అడుగుతుంటారు. నా పిల్లలు, ఇంట్లోవాళ్లు నా సినిమాలు చూస్తే ఏంటి స్నేహ ఇలా ఉంది అని అడగకూడదు. అందుకే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే అంగీకరిస్తున్నాను. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్నాను.'' అని చెప్పింది స్నేహ. ఇది విన్న వారు.... మరీ ఎక్కువైంది... పెళ్లైన నీకు గ్లామర్ పాత్రలు ఎవరు ఇస్తారు...అందుకే ఈ కవరేజ్ అని మాకు తెలవదా అంటున్నారు.
స్నేహ ప్రధాన పాత్రలో నటించిన 'ఉలవచారు బిర్యాని' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సినిమాలోలాగే బయట కూడా నేను భోజన ప్రియురాలిని. అంతేకాదు నా భర్త ప్రసన్నకుమార్ కూడా భోజన ప్రియుడే. ఇద్దరం కలిసి బయటకు ఎక్కడికైనా వెళ్లామంటే వెతికి వెతికి మంచి రెస్టారెంట్లు చూసుకుంటాం. ఆ తర్వాతే ఏ పనైనా చేస్తాం అన్నారు.

అలాగే... ''నా తొలి సినిమా నుంచి నా వయసుకు, అనుభవానికి మించిన పాత్రలే వస్తున్నాయి. అయినా వాటిని ఎంతో సమర్థవంతంగా పోషించాను. అవే నాకు పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు 'ఉలవచారు బిర్యాని'సినిమాలో గౌరీ పాత్ర కూడా అలాంటిదే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. సినిమాను చూసిన వారందరూ అభినందిస్తున్నారు. మా కుటుంబ సభ్యుల ఇచ్చిన ప్రశంసలు నాకు కొత్త ఉత్తేజాన్నిస్తున్నాయి. '' అన్నారు.
''ఈ పాత్ర గురించి చెప్పినప్పుడే నా పాత్రకు మంచి స్పందన వస్తుందని వూహించాను. నేను ఇంట్లో ఎలా ఉంటానో సినిమాలో అలాగే ఉన్నాను. అందుకే అంత సహజత్వం వచ్చింది. మరి మీ దంపతుల్ని ఒకేసారి తెరపై చూసే అవకాశం ఎప్పుడు అంటే.. ఇద్దరం కలసి నటించాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. మరోవైపు సినిమా నిర్మాణ రంగంలోకి రావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.త్వరలో మా సంస్థ నుంచి ఓ సినిమా ప్రారంభించబోతున్నాం'' అని తెలిపారు స్నేహ.


Click it and Unblock the Notifications











