'మావాడు'లో స్నేహ అందాల ఆరబోత

ఈ చిత్రం పాటల ప్రదర్శన ఫిలించాంబర్‌లో జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు దానికి దూరంగా ఎందుకు ఉన్నాడు. ఆ తరువాత అందరిచేత మావాడు' అని ఎలా అనిపించుకున్నాడు అనేది చిత్ర కథాంశం. శింబు సోదరుడుగా సీనియర్ నటుడు ప్రభు నటించారు. యువన్ శంకర్‌రాజా అద్భుతమైన సంగీతం అందించారు. వెన్నెలకంటి సంభాషణలు సినిమాకే హైలైట్. జనవరిలో తమిళనాడులో విడుదలై శింబు చిత్రాల్లో అన్నిటికంటె మించి విజయం సాధించింది. ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎస్.శరవణన్ అద్భుతంగా ఈచిత్రాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అని నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











