నాగార్జున సింప్లీ సూపర్బ్...
రాజన్న సినిమా చాలా గొప్ప చిత్రం అంటూ హీరోయిన్ స్నేహ పొగడ్తల వర్షం కురిపించింది. రాజన్న సినిమాలో నాగార్జున సరసన నటించిన స్నేహ చిత్రం విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో పాత్రికేయులతో ముచ్చటించారు. రాజన్న స్టోరీలైన్ వినగానే ఈచిత్రం చేయడానికి ఒప్పుకున్నానని చెప్పాను. లక్ష్మమ్మ గెటప్ లో నన్ను నేను ఊహించుకుని చాలా థ్రిల్ అయ్యాను. శ్రీరామదాసు తర్వాత నాగార్జునతో చేసిన మరో మంచి సినిమా ఇది. నేను నాగార్జున అభిమానిని. రాజన్న గెటప్ లో నాగార్జున గారు సింప్లీ సూపర్బ్. ఆయన కాంబినేషన్ లో చేసిన సీన్స్ అన్ని ఎక్స్ లెంట్. విజయేంద్ర ప్రసాద్ గారు సినిమాలో ఎమోషన్స్ ని అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు.
రాజమౌళిగారు యాక్షన్ సీక్వెన్స్ బ్రహ్మాండంగా తీశారు. రాజమౌళి గారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేసే అవకాశం రాజన్న సినిమాలో లభించింది. ఈ చిత్రంలో బేబి ఎని నటన అద్భుతం. 'అమ్మ అవని' పాట నాకు ఎంతో ఇష్టమైన పాట. కీరవాణి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాజన్న చిత్రం చూశాక ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఎంతో ఆనందించాను. నాకు ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నాగార్జునకి, విజయేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం అంటూ చెప్పుకొచ్చారు స్నేహ.


Click it and Unblock the Notifications











