Just In
- 7 hrs ago
ట్రెండింగ్ :బూతులు మాట్లాడిన అనసూయ..చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్..వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్లో
- 7 hrs ago
అది చూసి చాలా బాధపడ్డా.. నిజ జీవితంలో ఏం చెయ్యగలుగుతున్నాం.. కార్తికేయ కామెంట్స్
- 7 hrs ago
కలిసిపోయిన విన్నర్, రన్నర్.. జిగేల్ రాణి స్టెప్పులేసిన శ్రీముఖి, రాహుల్
- 8 hrs ago
ట్వీట్ డిలీట్ చేసిన పూనమ్.. నేను ఆమెను లవ్ చేస్తున్నా కత్తి మహేష్ పోస్ట్ వైరల్
Don't Miss!
- News
అత్యాచార నిందితులను ఉపేక్షించేది లేదు: ‘కేసీఆర్ ఉగ్రరూపం’ అంటూ మంత్రి తలసాని
- Sports
హైదరాబాద్లో పీవీ సింధుకి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- Lifestyle
ప్రతి రాత్రి నిద్రించే ముందు నిమ్మ మరియు తేనె మిశ్రమ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Technology
హువాయి బ్యాండ్ 4 ప్రో రిలీజ్... దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఫోటోలు: స్వీట్ షాక్ ఇచ్చిన స్నేహ.. కళ్ళు చెదిరేలా మారిపోయింది, దాని ఫలితమే!

సీనియర్ హీరోయిన్ స్నేహ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో రాణించిన స్నేహ హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2012 లో వివాహం అనంతరం సినిమాల్లో నటించడం బాగా తగ్గించింది. శ్రీరామదాసు, వెంకీ, సంక్రాంతి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ నటించిన సంగతి తెలిసిందే. ఈ హోమ్లీ హీరోయిన్ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిద్ధం అవుతోంది. రాంచరణ్ బోయపాటి చిత్రంలో స్నేహ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లకు వివాహం అనంతరం సహజంగా గ్లామర్ పై ఎక్కువగా శ్రద్ద చూపారు. కానీ ఇటీవల ఓ కార్యక్రమంలో మెరిసిన స్నేహా కళ్లుచెదిరే లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది.

తొలి వలపు అంటూ తెలుగువారిని
స్నేహ నటించినా తొలి తెలుగు చిత్రం తొలివలపు. గోపీచంద్ సరసన నటించిన ఈ చిత్రం 2001 లో విడుదలయింది. ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

సూపర్ హిట్ చిత్రాలు
స్నేహ తన కెరీర్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకీ చిత్రం స్నేహాకు తెలుగులో తొలి విజయాన్ని అందించింది. శ్రీరామదాసు చిత్రం స్నేహ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది.

తమిళ నటుడితో
తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012 లో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం స్నేహ సినిమాల్లో నటించడం బాగా తగ్గించింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలా
స్నేహ తెలుగులో సెకండ్ ఇనింగ్స్ షురూ చేసింది. బోయపాటి, రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రంలో స్నేహ కీలక పాత్రలో నటించడానికి సిద్ధం అయింది. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

షాక్ ఇస్తున్న స్నేహ లుక్
స్నేహా తాజాగా ఓ ఈవెంట్ మెరిసింది. స్నేహా లుక్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చేలా ఉంది. స్నేహా మునుపటికంటే నాజూగ్గా కనిపించడం విశేషం. స్నేహ ఆ మధ్యన జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాని ఫలితమే స్నేహా నాజూగ్గా మారడానికి కారణం అని అభిమానులు అంటున్నారు.