11న స్నేహతో ప్రసన్న వివాహం

By Pratap

ప్రముఖ సినీ నటి స్నేహ వివాహం జరగబోతోంది. చెన్నయ్‌లోని శ్రీవారి వెంకటాచలపతి కళ్యాణ మండపంలో మే 11, ఉదయం 9 గంటలకు ప్రసన్నతో నటి స్నేహ వివాహం వైభవంగా జరుగుతుందని బంధువులు తెలిపారు. మే 10న రిసిప్షన్‌ను ఏర్పాటు చేస్తారు. పెద్దల అనుమతితోనే నటుడు ప్రసన్న, స్నేహ వివాహం జరగబోతోంది.

వారి వివాహం చెన్నైలోని వనగరం, అడయాలపట్టులో ఉన్న ఎల్‌బిఆర్ గార్డెన్‌లో జరుగుతుంది. ముందు రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి కారణం ఉందట. వారి వివాహం రెండు సార్లు జరుగుతుంది. స్పేహ తరఫున నాయుడు సంప్రదాయంలోనూ ప్రసన్న కుటుంబం తరఫున బ్రాహ్మణ సంప్రదాయంలోనూ వీరి వివాహం జరుగుతుంది. తాను రెండు సార్లు తాళి కడుతున్నానని ప్రసన్న తన ఆనందాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.

పెళ్లి తర్వాత నటించేది లేనిది స్నేహ ఇష్టానికే వదిలేస్తున్నట్లు ప్రసన్న చెప్పారు. పెళ్లి తర్వాత నటించాలా, వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్నేహ చెప్పారు. ఆరు నెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. పెద్దల మనసును కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే రెండు సార్లు వివాహం చేసుకుంటున్నామని వారు చెప్పారు. పెండింగులో ఉన్న సినిమాలను పూర్తి చేసి, జూన్‌లో హానీమూన్ వెళ్తామని వారు చెప్పారు.

అచ్చముండు, అచ్చముండు సినిమాలో కలిసి నటించినప్పుడు స్నేహ, ప్రసన్న మధ్య ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. చాలా కాలం పాటు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట తమది కేవలం స్నేహమే అని చెప్పకొచ్చింది. ఇద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతోందని మీడియాలో వార్తలు గుప్పుమనడంతో ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఆ మధ్య ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X