నాకు ఆ ఖర్మ లేదంటున్న హాట్ ఆంటీ
కుర్ర హీరోయిన్ల ధాటికి ఆంటీగా ముద్ర పడిపోయింది హీరోయిన్ స్నేహ. అందుకే అమ్మడుకి వయసు పైబడ్డ హీరోలతో తప్ప కుర్ర హీరోలతో అవకాశాలు రావడం లేదు. ఈ సుందరికి కుటుంబ కథా చిత్రాల నాయికగా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ వుంది. బాపు దర్శకత్వంలో 'రాధా గోపాళం"లో నటించే అరుదైన అవకాశాన్ని పొంది బాపు బొమ్మగా మెరిసిపోయింది. తాజాగా ఈ భామ నాగార్జున సరసన 'రాజన్న" చిత్రంలో నటిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో వస్తోన్న ఈ చిత్రంపై ఈ ముద్దుగుమ్మ చాలా ఆశల్నే పెట్టుకుంది.
అయితే గతంలో మాదిరిగా అవకాశాలు లేనప్పటికీ కెరీర్ విషయంలో చాల సంతృప్తిగా వున్నానంటోంది స్నేహ. 'నటిగా నేనేంటో అందరికీ తెలుసు. నా ప్రతిభను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాల కోసం ఎదురుచూపులు చూడాల్సిన అవసరం నాకు లేదు" అని చెబుతోంది స్నేహ. ఇతర హీరోయిన్లలా పారితోషికం విషయంలో నిర్మాతలను వేధించే అలవాటు తనకు లేదని చెబుతూ....ఓవరైనా తనకు అవకాశం ఇవ్వక పోతారా అని ఆశగా ఎదురు చూస్తోంది.


Click it and Unblock the Notifications











