తల్లి పాత్ర కమిటైన స్నేహ
హైదరాబాద్: హోమ్లీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్నేహ త్వరలో తల్లి పాత్రలో కనిపించనుంది. హీరోయిన్స్ వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పేసి కొన్నేళ్ల తరవాత కొత్త ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడతారు. అప్పుడు వాళ్లకి తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు దక్కుతుంటాయి. ఆ రూట్ లోనే స్నేహ ప్రయాణం పెట్టుకుంది. స్నేహ ఇటీవలే వివాహం చేసుకొంది. అయితే నటనకు విరామం ఇవ్వకుండా ఓ సినిమా చేసింది. అందులో ఆమె తల్లి పాత్రలో కనిపించబోతోంది.
స్నేహ మాట్లాడుతూ ''హరిదాస్ అనే తమిళ చిత్రంలో ఓ పదేళ్ల బాలుడికి తల్లి పాత్ర పోషించాను. కథలో నా పాత్ర కీలకమైనది కావడంతోనే అంగీకరించాను. దర్శకుడు నేనైతే బాగుంటుందని పట్టుబట్టారు'' అన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'కొచ్చాడయాన్' సినిమాలో నటి స్నేహ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె రజనీ చెల్లెలి పాత్రలో నటించాల్సి ఉంది.
రజనీ లాంటి పెద్ద స్టార్‌తో అవకాశం రాగానే ఎగిరి గంతేసిన స్నేహ ఆ సినిమా నుంచి తప్పుకుంది. కారణం ఏమిటంటే... డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని చెప్పింది. ఆమె పెళ్లి గురించే ఆ పాత్రను రిజెక్టు చేసిందని తెలిసింది. అప్పుడు ఆమె స్థానంలో తమిళ నటి రుక్మిణిని ఎంపిక చేశారు. ఇక స్నేహ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటంతో ఆమెకు తమ చిత్రాల్లో కీలకమైన రోల్స్ ఇవ్వటానికి దర్శక,నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications











