కంగ్రాట్స్ మెసేజ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్నేహ

తెలుగులో తనదైన శైలి నటనతో ఎంతో మంది ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది సీనియర్ హీరోయిన్ స్నేహ. గ్లామరస్ పాత్రలు చేయకుండానే తెలుగులో ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈమె.. పలు చిత్రాల్లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది. దీంతో ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో టాలీవుడ్‌లోని బడా హీరోలతో నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో తమిళంలోకి వెళ్లిపోయింది.

అక్కడ కూడా వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'అచ్చముండు అచ్చముండు' సినిమా షూటింగ్‌ సమయంలో తమిళ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లైన తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటించడానికి ప్రసన్న అడ్డు చెప్పలేదు. దీంతో ఆమె పలు సినిమాలతో పాటు ఎన్నో టీవీ షోలలో పాల్గొంది. కొద్ది నెలలకు ఈ జంటకు ఓ మగ పిల్లాడు జన్మించాడు. అతడికి విహాన్‌ అనే పేరు పెట్టారు.

Sneha, Prasanna are set to welcome their second baby

ఇక, తాజాగా ఆమె మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్నేహ స్వయంగా వెల్లడించింది. దీంతో ఆమెకు, ప్రసన్నకు కంగ్రాట్స్ అంటూ ఎంతో మంది మెసేజ్‌లు చేస్తున్నారట. అలాగే, సోషల్ మీడియాలో సైతం ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్నేహ.. ఈ ఏడాది రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో చివరిగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X