పర్శనల్ ఫోటో : కర్ఛీఫ్ అడ్డం పెట్టుకుని అల్లు అర్జున్ తన భార్యతో

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో పర్శనల్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ బయిట తిరగాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఫలనాచోట అల్లు అర్జున్ ఉన్నాడంటే జనం పనులు మానుకుని వచ్చి మూగిపోతారు. అయితే మరి వారికి తన కుటుంబంతో కలిసి ఛార్మినార్ వంటి ప్లేస్ లుకు వెళ్లాలనిపించదా..అనిపిస్తుందా..అదిగో అలాంటప్పుడే ఇదిగో ఇలా ...కర్ఛీఫ్ అడ్డం పెట్టుకుని వస్తూంటారు. ఇదిగో రీసెంట్ గా ఛార్మినార్ వద్ద తీసిన ఫొటోలో అల్లు అర్జున్ ని చూడండి. ఈ ఫొటోని అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ష్రే చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం విషయానికి వస్తే...

అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తాజాగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చా ని ఈ సినిమాకోసం తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.

Sneha Reddy sahre ...Bunny with wife @ Charminar

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫైట్ షూటింగ్ తో ఈ నెల 19నుండి ప్రారంభించారు. ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

చిత్రం వివరాల్లోకి వెళితే..

తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం.

Sneha Reddy sahre ...Bunny with wife @ Charminar

బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ సినిమా రూపొందనుంది.థమన్‌.ఎస్‌.ఎస్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X