అల్లు అర్జున్ సినిమాలో స్నేహ...ఏ పాత్రకు?

By Bojja Kumar

హైదరాబాద్: ‘జులాయి' తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నసంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని ఓ ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ స్నేహ నటించబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆమె అఫీషియల్‌గా సైన్ చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె ఏ పాత్ర చేస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.

ఏప్రిల్ 10న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. అక్టోబర్లో నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సమంత, ఆదా శర్మ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

 Sneha signed for Allu Arjun movie

మరో వైపు....క్యారెక్టర్‌కు తగిన విధంగా 10 కేజీల బరువు తగ్గాలని దర్శకుడు త్రివిక్రమ్ ఆర్డర్ వేసారట. ఇటీవల రుద్రమదేవి షూటింగు కోసం కాస్త బరువు పెరిగిన అల్లు అర్జున్....త్రివిక్రమ్ సూచనల మేరకు బరువు తగ్గించుకునేందుకు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చమటోడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈచిత్రం కోసం త్రివిక్రమ్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది. రూ. 12 కోట్ల రెమ్యూరేషన్‌‍తో పాటు 25 శాతం టేబుల్ ప్రాఫిట్ తీసుకుంటున్నాడట త్రివిక్రమ్. అంటే ఈమొత్తం దాదాపుగా 15 నుండి 18 కోట్లు ఉండొచ్చని అంటున్నారు. అయితే బన్నీ రెమ్యూనరేషన్ రూ. 8 కోట్ల లోపే ఉంటుందని అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X