టాలీవుడ్ హాట్ హాట్ హీరోయిన్లు భూమిక,అనుష్క ల యోగా రూటులోకి మరో హీరోయిన్ కోత్తగా వచ్చి చేరింది.ఆమె బాపు బొమ్మ స్నేహ.మహర్షి మహేష్ యోగి విశ్య వ్యాప్తం చేసిన భావాతీత ధ్యానం ద్వారా ఆమె ఈ యోగా మార్గంలోకి రాబోతోంది. అనుష్క మెదటి నుంచీ యోగా టీచరు. ఆ రకంగానే సినిమాల్లో పరిచయం అయ్యి ఇప్పుడు పీల్డును దున్నేస్తోంది. ఇక భూమిక తన భర్త భరత్ ఠాకూర్ ని యోగా క్లాసులోనే పట్టుకుంది. అలా వాళ్ళిద్దరూ యోగా అండతో లబ్ది పొందినవారే. ఇక ఇప్పుడు స్నేహ వంతు. మరి ఏ రకంగా ఆమె తను నేర్చుకున్న యోగా ద్వారా లాభపడుతుంది అంటే భోధకురాలిగా ముందుకు వెళ్తుందిట. దాంతో నిజానికి యోగా ద్వారా వచ్చే ఆధ్యాత్మిక ఫలితాలు కన్నా ఇవే బాగున్నాయిని మరింత మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.